- Home
- Entertainment
- `ఎస్‌ఎస్‌ఎంబీ29` మూవీ టీజర్ అప్ డేట్, డేట్ ప్లేస్ ఫిక్స్.. రాజమౌళి రియాక్షన్ ఇదే
`ఎస్‌ఎస్‌ఎంబీ29` మూవీ టీజర్ అప్ డేట్, డేట్ ప్లేస్ ఫిక్స్.. రాజమౌళి రియాక్షన్ ఇదే
SSMB29 : మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న `ఎస్‌ఎస్‌ఎంబీ 29` నుంచి టీజర్ రాబోతుందట. దీనికి సంబంధించిన డేట్, ప్లేస్ ఫైనల్ అయినట్టు సమాచారం.

అంతర్జాతీయ స్థాయిలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` మూవీ
`ఆర్‌ఆర్‌ఆర్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న మూవీ `ఎస్‌ఎస్‌ఎంబీ 29`. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రమిది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని గ్లోబల్ ట్రోటర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది. ఆమెది కీలక పాత్ర అని సమాచారం. నెగటివ్ షేడ్ నుంచి పాజిటివ్‌గా టర్న్ తీసుకునే పాత్ర అని, మహేష్‌కి సపోర్ట్ గా ఉండే పాత్రలో ప్రియాంక కనిపిస్తుందని సమాచారం.
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఎంబీ29 మూవీ
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో మహేష్ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారనేది గతంలో ఓ సందర్భంలో రాజమౌళి చెప్పారు. `అల్లూరి సీతారామరాజు` లాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే ఆడియెన్స్ రియాక్షన్ లేదు, జేమ్స్ బాండ్ లాంటి మూవీ అంటే అరుపులతో హోరెత్తించారు. బహుశా ఇప్పుడు రాజమౌళి కూడా మహేష్ తో జేమ్స్ బాండ్ లాంటి మూవీ తీయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కొంత `ఇండియానా జోన్స్` స్టయిల్ కూడా ఉంటుందని సమాచారం. మనవైన ఎమోషన్స్ ని, కల్చర్‌ని జోడించీ ఈ మూవీని తీస్తున్నారట. ఏదేమైనా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
సినిమాపై అంచనాలు పెంచిన లీక్ ఫోటోలు
ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియో క్లిప్స్ మరింతగా ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సింహం ఉన్న సీన్లు గూస్ బంమ్స్ తెప్పించాయి. మొత్తంగా రాజమౌళి పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోస్, టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్టిస్ట్ లు కూడా కనిపిస్తారని సమాచారం.
ఎస్‌ఎస్‌ఎంబీ29 టీజర్ అప్ డేట్
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు రాబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. నవంబర్‌లో అప్ డేట్ ఉంటుందని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి వెల్లడించారు. ఇక నవంబర్ రాబోతుంది, మరి `ఎస్‌ఎస్‌ఎంబీ29` అప్ డేట్ ఎప్పుడనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ నుంచి టీజర్‌ని విడుదల చేయబోతున్నారట. నవంబర్ 15న రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఇందులో టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే తాజాగా `బహుబలిః ది ఎపిక్` చిట్ చాట్‌లో రాజమౌళిని ప్రభాస్ అప్ డేట్ అడగ్గా, అది(సినిమా) అవుతుందని, ఏ రోజైతే సాటిస్పై అవుతామో అప్పుడే ఉంటుందన్నారు. దీంతో మరింత సస్పెన్స్ లో పెట్టారు.
ఎస్‌ఎస్‌ఎంబీ29కి వినిపిస్తోన్న టైటిల్ `వారణాసి`
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు టైటిల్ రివీల్ కాలేదు. ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ఆ రోజే టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూవీకి `వారణాసి` అనే పేరు వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో రాజమౌళి, మహేష్ లు కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు హాలీవుడ్ స్టూడియోస్ కూడా భాగం కాబోతున్నాయట. ప్రపంచానికి దీన్నొక ఇంగ్లీష్ మూవీగా ప్రొజెక్ట్ చేసే ప్లాన్‌లో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఇలా అయితేనే ఆస్కార్‌కి వెళ్లడానికి ఈజీ అవుతుందని భావిస్తున్నారట. వీటికి సంబంధించిన మరింత క్లారిటీ రావాల్సి ఉంది.