అక్కినేని కోడలిపై సెటైర్ వేసిన మహేష్ బాబు..దెబ్బకి బ్యాగ్రౌండ్ మొత్తం బయటకి తీసింది
శోభిత తెలుగు అమ్మాయే. అక్కినేని కోడలు కాబోతుండడంతో ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. శోభిత ధూళిపాళ, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య ఒక సందర్భంలో సరదా సంఘటన జరిగింది.
త్వరలో శోభిత ధూళిపాళ అక్కినేని ఫ్యామిలీ కోడలిగా మారబోతోంది. ఆల్రెడీ నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ పూర్తయింది. వీళ్లిద్దరి గురించి గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇంత త్వరగా స్వీట్ షాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. సమంతతో విడిపోయాక చైతు.. శోభితతో ప్రేమలో పడ్డాడు. ఏది ఏమైనా శోభిత, చైతు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
శోభిత తెలుగు అమ్మాయే. అక్కినేని కోడలు కాబోతుండడంతో ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. శోభిత ధూళిపాళ, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య ఒక సందర్భంలో సరదా సంఘటన జరిగింది. శోభిత మహేష్ బాబు నిర్మించిన మేజర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, అడివి శేష్, శోభిత అంతా ఒకే చోట కూర్చుని మేజర్ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. అందరూ మాట్లాడుతుండగా శోభిత ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టింది. మహేష్ బాబు వెంటనే తెలుగులో మాట్లాడవా ప్లీజ్ అంటూ సెటైర్ వేశారు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు.
శోభిత సిగ్గుపడుతూ నేను పుట్టింది తెనాలిలోనే.. కానీ తెలుగు అంత స్పష్టంగా రాదు అని చెప్పింది. దానికి కారణం వివరిస్తూ బ్యాగ్రౌండ్ మొత్తం రివీల్ చేసింది. మా అమ్మ వాళ్ళ ఊరు తెనాలిలో పుట్టాను. పెరిగింది వైజాగ్ లో. అక్కడే స్కూల్ లో చదువుకున్నా. కాలేజ్ విద్య కోసం ముంబై వెళ్ళాను. అప్పటి నుంచి ముంబైలోనే ఉంటున్నా.
ఆ తర్వాత మోడలింగ్ కి వెళ్లి ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచినట్లు తెలిపింది. ఆ తర్వాత ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నా. కానీ ఎలాంటి సపోర్ట్, ప్లాన్ లేదు. సొంతంగానే ఆడిషన్స్ కి వెళ్లడం మొదలు పెట్టా. యాక్టింగ్ నాకెంతో నచ్చింది అని శోభిత పేర్కొంది.
కొన్ని హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత తొలిసారి తెలుగులో అడివిశేష్ గూఢచారి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ మూవీ సూపర్ హిట్. ఆ తర్వాత మళ్ళీ మేజర్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. అదే విధంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించింది.