MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Mahesh Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణకి తెలియకుండా ఆ పని చేసి పోలీసులకు దొరికిన మహేష్‌.. మామూలోడు కాదుగా

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణకి తెలియకుండా ఆ పని చేసి పోలీసులకు దొరికిన మహేష్‌.. మామూలోడు కాదుగా

మహేష్‌ బాబు ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. కానీ చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడట. ఆయన చేసిన పనికి పోలీసులకు దొరికిపోవాల్సి వచ్చిందట. ఆ కథేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 02 2025, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి సినిమాతో బిజీగా మహేష్‌ బాబు
Image Credit : X/SSMBTrendsTeam

రాజమౌళి సినిమాతో బిజీగా మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం గ్లోబల్‌ ఫిల్మ్ చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్నేషన్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని, ఇందులో మహేష్‌ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని గతంలో రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికితోడు ఇప్పుటికే లీక్ అయిన ఫోటోలు, వీడియోలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లీకైన లుక్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచారు మహేష్‌. ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం అభిమానులు, అలాగే సినీ ప్రియులు ఎదురు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అంతర్జాతీయంగా ఈ సినిమాని విడుదల చేయసేందుకు హాలీవుడ్‌ స్టూడియోస్‌తోనే రాజమౌళి డీల్‌ సెట్‌ చేస్తున్నారు. ప్రారంభం నుంచి దీన్ని తెలుగు సినిమాలా కాకుండా ఒక అంతర్జాతీయ మూవీగా ప్రమోట్‌ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్‌లో సెటైర్లకి కేరాఫ్‌ మహేష్‌ బాబు
Image Credit : Asianet News

టాలీవుడ్‌లో సెటైర్లకి కేరాఫ్‌ మహేష్‌ బాబు

ఈ నేపథ్యంలో మహేష్‌ బాబుకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. హీరోగా పక్కన పెడితే పర్సనల్ గా ఆయన ఎంతటి ఫన్నీగా ఉంటారో, సరదాగా ఉంటారో అనే విషయం కొంత మందికే తెలుసు. అయితే ప్రెస్‌ మీట్లలో, ఇంటర్వ్యూలలో మాత్రం ఆ విషయం తెలుస్తుంది. ఆయన వేసే సెటైర్లు వేరే లెవల్లో ఉంటాయి. చాలా మంది పెద్ద వాళ్లు కూడా మహేష్‌ సెటైర్లపై సరదాగా కామెంట్ కూడా చేశారు. వెటకారంతో కూడిన పంచ్‌లకు ఇతర కో స్టార్స్ కూడా షాక్‌ అవుతుంటారు. అంతటి స్పాంటినిటీ మహేష్‌ సొంతం. అయితే చిన్నప్పట్నుంచి మహేష్‌ చాలాస్పీడ్‌ అని, ఏదైనా అనుకున్నాడంటే ఆ విషయం చేసి చూపిస్తాడని సూపర్‌ స్టార్‌ కృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు. అయితే బాల నటుడిగా ఉన్నప్పుడు బైక్‌ రైడ్‌ చేసి ఆశ్చర్యపరిచారట. షూటింగ్‌ సమయంలో గుంటలపై కూడా ఎలాంటి డూప్‌లేకుండా తనే డ్రైవ్‌ చేసేవాడని తెలిపారు.

Related Articles

Related image1
Mahatma Gandhi Roles: మొదటగా గాంధీజీ పాత్రలో నటించిందెవరో తెలుసా.. బాపుగా మెరిసిన స్టార్స్ వీరే
Related image2
Allu Sirish: ఎంగేజ్‌మెంట్‌ ప్రకటించిన అల్లు శిరీష్‌, తన కాబోయే భార్య నయనిక ఎవరో తెలుసా? వదినే అంతా సెట్‌ చేసిందా?
35
లైసెన్స్ లేకుండా కార్ డ్రైవ్‌ చేసిన మహేష్‌
Image Credit : Facebook/Mahesh Babu

లైసెన్స్ లేకుండా కార్ డ్రైవ్‌ చేసిన మహేష్‌

ఇదిలా ఉంటే చిన్నప్పుడు చేసిన మరో అల్లరి పనిని చిన్నాన్న ఆదిశేషగిరి రావు బయటపెట్టారు. మహేష్‌ ఎంతటి అల్లరిగా ఉండేవాడో తెలిపారు. తన 14 ఏళ్ల వయసులో ఆయన మహేష్‌ బాబు తన అక్క పద్మ కారు తీసుకుని షికారుకి వెళ్లాడట. అప్పటికీ డ్రైవింగ్‌ లైసెన్స్ లేదు. పోలీసులు చిన్నగా ఉన్న మహేష్‌ని గమనించారు. పట్టుకునేందుకు వెంటపడ్డారట. కానీ వాళ్లకి దొరక్కుండా వాళ్ల ఆఫీస్‌లోకి ఫాస్ట్ గా వచ్చేశాడట. ఆఫీస్‌ వెనకాల కారు పెట్టి, సైలెంట్‌గా లోపలకి వచ్చి బాబాయ్‌ ఆదిశేషగిరి రావు వద్ద కూర్చున్నాడట.

45
పోలీసులకు దొరికిన మహేష్‌, కృష్ణ ఏం చేశాడు?
Image Credit : Instagram / Mahesh babu

పోలీసులకు దొరికిన మహేష్‌, కృష్ణ ఏం చేశాడు?

కానీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. వాళ్ల పద్మాలయ స్టూడియో ఆఫీసుకి వచ్చారు. ఇలా ఎంక్వైరీ చేయగా, మహేష్‌ని చూసి గుర్తుపట్టారట. పోలీసులు నిలదీయగా వాళ్లకి ఆది శేషగిరి రావు ఏదో చెప్పి మ్యానేజ్‌ చేశాడట. మొత్తానికి అలా మహేష్‌ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. తన ఆఫీసులో దొరికిపోవడంతో బయటపడ్డాడు. అదే బయట రోడ్లపై దొరికితే పెద్ద రచ్చ అయ్యేదని తెలిపారు ఆదిశేషగిరిరావు. అంతేకాదు ఈ విషయం సూపర్‌ స్టార్‌ కృష్ణకి తెలియకుండా మ్యానేజ్‌ చేశారట. మొత్తానికి బాబాయ్‌ వల్ల మహేష్‌ పోలీసుల నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు.

55
మహేష్‌ బాబు సినిమాలు
Image Credit : X / @MaheshFanTrends

మహేష్‌ బాబు సినిమాలు

మహేష్‌ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సూపర్‌ స్టార్‌ కృష్ణకి కొడుకుగా, తమ్ముడిగానూ నటించారు. బాలనటుడిగా పలు సినిమాలు చేశాక `రాజకుమారుడు` సినిమాతో హీరోగా మారారు మహేష్‌ బాబు. తొలి సినిమా ఫర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్‌ కాదు. ఆ తర్వాత `మురారి`తో తొలి హిట్‌ని అందుకున్నాడు. `ఒక్కడు` సినిమాతో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు మహేష్‌ బాబు. `పోకిరి` మూవీ ఆయన్ని సూపర్‌ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. `దూకుడు`, `శ్రీమంతుడు`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`, `సర్కారు వారి పాట`, `గుంటూరు కారం` చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
Mahatma Gandhi Roles: మొదటగా గాంధీజీ పాత్రలో నటించిందెవరో తెలుసా.. బాపుగా మెరిసిన స్టార్స్ వీరే
Recommended image2
Allu Sirish: ఎంగేజ్‌మెంట్‌ ప్రకటించిన అల్లు శిరీష్‌, తన కాబోయే భార్య నయనిక ఎవరో తెలుసా? వదినే అంతా సెట్‌ చేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved