MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ లో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ చూశారా..బాబోయ్, అవిటివాడే కానీ రాక్షసుడిలా

మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ లో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ చూశారా..బాబోయ్, అవిటివాడే కానీ రాక్షసుడిలా

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Nov 07 2025, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1000 కోట్ల బడ్జెట్ లో గ్లోబ్ ట్రాటర్ 
Image Credit : Asianet News

1000 కోట్ల బడ్జెట్ లో గ్లోబ్ ట్రాటర్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ లో కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి మహేష్ మూవీతో హాలీవుడ్ మార్కెట్ లో సైతం పాగా వేయాలని జక్కన్న ప్రయత్నిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ 
Image Credit : Instagram/Rajamouli

ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ 

ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రపంచాన్ని తిరిగి వచ్చే సాహసికుడిగా మహేష్ బాబు నటిస్తున్నారు. స్టోరీ థీమ్ ఏంటనేది పూర్తిగారాజమౌళి ఇంకా బయట పెట్టలేదు. కానీ ఆఫ్రికా అడవుల నేపథ్యం, అందులో హిందూ పురాణాలకు సంబంధించిన అంశాలు ఉండబోతున్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన తొలి రివీల్ ఉండబోతోంది. దీనిని జక్కన్న కనీవినీ ఎరుగని విధంగా ప్లాన్ చేస్తున్నారు. 

35
భారీ ఈవెంట్ కి ఏర్పాట్లు 
Image Credit : our own

భారీ ఈవెంట్ కి ఏర్పాట్లు 

రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని ప్రసారం చేసేందుకు జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారా ? లేక టీజర్ లాంటి సర్ప్రైజ్ ఉంటుందా ? అనేది కూడా క్లారిటీ లేదు. ఈ సినిమా తొలి అప్డేట్ కోసమే రాజమౌళి ఇంత ప్లాన్ చేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం అవుతోంది. నవంబర్ 15 దగ్గర పడుతున్న సమయంలో రాజమౌళి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారం మొత్తం SSMB 29 అప్డేట్స్ ఉంటాయని తాజాగా ట్విట్టర్ లో ప్రకటించారు.

45
పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Image Credit : Asianet News

పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఈ చిత్ర క్లైమాక్స్ గురించి రాజమౌళి కామెంట్స్ చేశారు. 'భారీ ఎత్తున క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. క్లైమాక్స్ షూటింగ్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ ముగ్గురూ పాల్గొంటున్నారు. మరోవైపు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నాం. మీరంతా దీనిని ఎక్స్పీరియన్స్ చేసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా. ఈవెంట్ జరిగే వరకు ఈ వారం ఆసక్తికర అప్డేట్స్ వస్తుంటాయి. ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం' అని రాజమౌళి ఎక్స్ లో ప్రకటించారు. ఇంతలోనే మహేష్ బాబు తన ఎక్స్ వేదికపై పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

Stood on the other side… 
time to meet you head-on KUMBHA… @PrithviOfficial#GlobeTrotter@ssrajamouli @priyankachopra @mmkeeravaani @SriDurgaArts @SBbySSK pic.twitter.com/29TS5G4pDY

— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2025

55
అవిటివాడే కానీ రాక్షసుడు 
Image Credit : Asianet News

అవిటివాడే కానీ రాక్షసుడు 

పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. పృథ్వీరాజ్ పాత్ర పేరు కుంభ అని మహేష్ రివీల్ చేశారు. పృథ్వీరాజ్ ఈ చిత్రంలో అవిటివాడిలా నటిస్తున్నారు. అవిటివాడు అయినప్పటికీ ఒక రోబోటిక్ వీల్ చైర్ లో కూర్చుని.. నాలుగు చేతుల రాక్షసుడిలా కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్ర ఈ మూవీలో ఎంత బలంగా ఉండబోతోంది చెప్పడానికి ఇదే ఉదాహరణ. మొత్తంగా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. 

పృథ్వీరాజ్ కుంభ ఫస్ట్ లుక్ ని రాజమౌళి కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రిథ్వీరాజ్ తో ఈ సినిమాలో ఫస్ట్ షాట్ చిత్రీకరించిన వెంటనే నేను అతడి వద్దకు వెళ్లి.. నేను చూసిన గొప్ప నటుల్లో నువ్వు కూడా ఒకడివి అని చెప్పా. ఈ పవర్ ఫుల్, రూత్ లెస్, భయంకరమైన పాత్రకి ప్రాణం పోసినందుకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ పాత్రలో నటిస్తున్నందుకు పృథ్వీరాజ్ కి ధన్యవాదాలు అని రాజమౌళి పేర్కొన్నారు. రాజమౌళికి పృథ్వీరాజ్ రిప్లై ఇచ్చారు. మీ దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఇంకా మిగిలి ఉన్న మ్యాడ్ రైడ్ కోసం ఎదురుచూస్తున్నా సార్ అని పేర్కొన్నారు. 

It’s been an absolute honour Sir! So looking forward to the rest of this mad mad ride! 🔥@ssrajamouli https://t.co/9g5XulTgmX

— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 7, 2025

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image2
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Recommended image3
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Related Stories
Recommended image1
త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే, వరస్ట్ మూవీ ఏంటో తెలుసా ?
Recommended image2
మహేష్ బాబు 'ఒక్కడు' ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఒకే ఒక్క మూవీ.. ఎన్టీఆర్, రవితేజ సినిమాలు గల్లంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved