Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోకి లిప్ కిస్ ఇవ్వనన్న కీర్తీ సురేష్.. పెద్ద హీరోని అవమానించిందిగా..?

స్టార్ హీరోకి లిప్ కిస్ ఇవ్వనన్న కీర్తీ సురేష్.. పెద్ద హీరోని అవమానించిందిగా..?

అవ్వడానికి మలయాళ అమ్మాయి అయినా.. తెలుగు పిల్ల అనిపించుకుంది కీర్తి సురేష్. తెలుగు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో ముచ్చటైన నటన కనబరిచిన ఈ బ్యూటీ.. ఓ సందర్భంలో స్టార్ హీరోకి లిప్ కిస్ ఇవ్వడాని నిరాకరించిందట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో..? ఏంటా సినిమా..?

Mahesh Jujjuri | Published : Feb 17 2024, 01:32 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

అచ్చతెలుగు హీరోయిన్ మన కీర్తి సురేష్. ఆమెను ఎవరూ మలయాళీ అమ్మాయి అని అనుకోరు. అంతాలా మన తెలుగువారితో కలిసిపోయి నటిస్తోంది బ్యూటీ. ఎక్కువగా నాని సినిమాల్లో కనిపించిన ఈబ్యూటీ... టాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోల సరసన మాత్రమే కనిపించి మురిపించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. 

27
Asianet Image

అయితే కీర్తి సురేష్ మొదటి నుంచి పద్దతిగానేఉంటూ వస్తోంది. అందుకే కమర్షియల్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఈమధ్య కాలంలోనే మరీ తెగించకుండా.. కాస్త కమర్షియల్ వేశాలు వేస్తుంది. అందాలు ఆరబోస్తూ.. ఇన్ స్టాలో సందడి చేస్తోంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మురిపించిన ఈ బ్యూటీ.. అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడీగా అజ్ఞాతవాసి సినిమాలో కూడా నటించింది. 
 

37
Asianet Image

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా బాగుంది..బుట్టబొమ్మలా కనిపించింది. కళ్లతోనే అభినయించి మెప్పించింది. కాని అజ్ఞాతవాసి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.  కానీ కీర్తి సురేష్ అభినయానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కీర్తి సురేష్ నటన, అభినయానికి అవకాశాలువెతుక్కుంటూ వచ్చాయి. ఆతరువాత వచ్చిన మహానటి సినిమాతో ఆమె స్టార్ గామారింది. 

47
Asianet Image

మహానటి మూవీతో కీర్తి సురేష్ భారీ విజయం సొంతం చేసుకుంది. అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. సావిత్రిగా జీవించిన కీర్తి సురేష్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ కి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాప్ స్టార్స్ తో కూడా ఆమె నటిస్తున్నారు. 

57
Asianet Image

హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ నుండి బయటపడాలని చూస్తున్న అమ్మడు గ్లామర్ రోల్స్ కూడా చేస్తుంది. మహేష్ బాబుకు జంటగా నటించిన సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేయడం విశేషం. గత చిత్రాలతో పోల్చితే సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ బోల్డ్ గా కనిపించింది.

67
Asianet Image

 ఇక రీసెంట్ గా నానితోదసరా మూవీ చేసి హిట్ కొట్టిన కీర్తి సురేష్ కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే టాలీవుడ్ కి ఎంటర్ అయిన కొత్తల్లో ఆమె స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేసిందట. అందుకు కారణం… ఆ మూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉండటమేనట. ఆ సినిమా నితిన్ ది కాగా.. అందులో నితిన్ డీప్ లిప్ లాక్ ఉందట. దాంతో సినిమాను వదిలేసుకుందట కీర్తి సురేష్. 

77
Asianet Image

 ఆ టైమ్ లో నితిన్ అప్పుడు హిట్స్ తో ఫార్మ్ లో ఉన్నాడు.కీర్తి సురేష్ తెలుగులో అప్పుడప్పుడే ఎదుగుతుంది. అయితే ఆతరువాత వీరిద్దరు కలిసి నటించారు కూడా రంగ్ దే మూవీలో జతకట్టారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. నితిన్ మాత్రం హిట్ కోసం చూస్తున్నాడు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
నాని (నటుడు)
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories