MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Mad Square :మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్ షో రివ్యూ..కొన్ని నిమిషాలు నవ్వులు సరిపోతాయా, మూవీ హిట్టా ఫట్టా ?

Mad Square :మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్ షో రివ్యూ..కొన్ని నిమిషాలు నవ్వులు సరిపోతాయా, మూవీ హిట్టా ఫట్టా ?

మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. యూత్ ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. మరి మ్యాడ్ స్క్వేర్ కామెడీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 28 2025, 06:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mad Square Review

Mad Square Review

సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాణంలో, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 2023లో విడుదలైన మ్యాడ్ చిత్రం మంచి విజయం సాధించింది. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. యూత్ ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. మంచి అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. యుఎస్ ప్రీమియర్ షోలు ఆల్రెడీ మొదలయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Mad Square

Mad Square

మరి మ్యాడ్ స్క్వేర్ కామెడీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో కామెడీని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. అది వర్కౌట్ అయితే చాలు. మరి ఆ కామెడీతో దర్శకుడు, నటీనటులు ఎలాంటి మ్యాజిక్ చేశారు అనే దానిపైనే ఈ చిత్ర సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్స్ ప్రకారం మ్యాడ్ స్క్వేర్ లో ఫస్ట్ హాఫ్ కామెడీ కొంత వరకు వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. 

36
Mad Square

Mad Square

కీలకమైన పెళ్లి సన్నివేశంలో కామెడీ పంచ్ లు బాగా పేలాయి. మొదటి 30 నిమిషాలు ఫుల్ కామెడీ అన్నట్లుగా సాగుతుంది. అయితే అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాస్త కథని పరిచయం చేశారు. కానీ ఈ చిత్రంలో కథ అంతగా గొప్పగా అనిపించదు. కొన్ని సన్నివేశాల్లో బలవంతంగా కామెడీ రుద్దినట్లు అనిపిస్తుంది. 

46
Mad Square

Mad Square

లడ్డు క్యారెక్టర్ బావుంది. లడ్డు వాళ్ళ తండ్రితో వచ్చే సన్నివేశాలు, భాయ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మరికొందరు ఆడియన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. కథ చెప్పకుండా సీన్ బై సీన్ కామెడీ పంచ్ లు వేసుకుంటూ వెళ్లడమే దీనికి కారణం. ఇక ఫస్ట్ హాఫ్ లో గోవా ఎపిసోడ్ అంత బాగా వర్కౌట్ కాలేదని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ ని 30 నిమిషాల మంచి కామెడీతో లాక్కొచ్చారు. 

56
Mad Square

Mad Square

ట్రైలర్ లో లడ్డు హంగామా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. లడ్డు కామెడీ బావుంది కానీ ఆశించిన స్థాయిలో లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ లో గోల ఎక్కువై కామెడీ తగ్గిపోయింది. లాజిక్ లేని కామెడీ సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని అంటున్నారు. 

66
Mad Square

Mad Square

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నవ్వించే ప్రయత్నం చేశారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ గ్లామర్ అట్రాక్షన్ గా ఉంటుంది. మ్యూజిక్ పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మ్యాడ్ స్థాయిలో మ్యాడ్ స్క్వేర్ లేదని అంటున్నారు. ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టే బాక్సాఫీస్ రిజల్ట్ ఉంటుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నాగ వంశీ సూర్యదేవర
సినిమా సమీక్షలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved