Macherla Niyojakavargam Review:'మాచర్ల నియోజకవర్గం' ప్రీమియర్ రివ్యూ.. నితిన్ 'మాస్' ఆశలని దర్శకుడు నిలబెట్టడా
నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత నితిన్ నటించిన మాస్ మూవీ ఇది. ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత నితిన్ నటించిన మాస్ మూవీ ఇది. ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలోని సాంగ్స్.. నితిన్, కృతి శెట్టి లుక్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. టీజర్, ట్రైలర్స్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మొదటి షోలు మొదలయ్యాయి. మరి ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.
విలన్ సముద్రఖని కి సంబంధించిన రాజకీయ సన్నివేశలతో చిత్రం మొదలవుతుంది. స్టైలిష్ ఫైట్ తో హీరో నితిన్ ఎంట్రీని చక్కగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్.. హీరోయిన్లతో నితిన్ మధ్య సన్నివేశాలు.. ఇలా ఫస్ట్ హాఫ్ సరదాగా ముందుకు వెళుతుంది.
బ్యాగ్రౌండ్ స్కోర్ బావుండడం ఈ చిత్రానికి కలసి వచ్చే అంశం. ప్రీ ఇంటర్వెల్ వరకు చిత్రం చాలా నెమ్మదిగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఆ తర్వాతే వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ లో వచ్చే మాస్ ఫైట్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు కథకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సో సో గా నడిపించారు అనే కామెంట్స్ వినిపిస్తాయి.
ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత దర్శకుడు కథ మొత్తం సెకండ్ హాఫ్ కే వదిలిపెట్టినట్లు అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రెగ్యులర్ ఫార్ములాలోనే సాగుతుంది. దీనితో ప్రేక్షలులు యావరేజ్ మూవీ అనే కామెంట్స్ చేస్తున్నారు.
సెకండ్ హాఫ్ లో ఎంగేజింగ్ గా అనిపించే సీన్స్ ప్రారంభంలోనే పడ్డాయి. ఆ తర్వాత నితిన్ ఐఏఎస్ అధికారిగా ఛార్జ్ తీసుకుంటాడు. సెకండ్ హాఫ్ లో బ్రహ్మాజీ ఎమ్మార్వోగా ఎంట్రీ ఇస్తాడు. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని హైలైట్ మూమెంట్స్ పడ్డాయి. రారా రెడ్డి సాంగ్, పొలిటికల్ సీన్స్ మెప్పించే విధంగా ఉంటాయి.
అయితే సెకండ్ హాఫ్ లో సీన్స్ సినిమా మొత్తాన్ని కాపాడతాయా అంటే వేచి చూడాల్సి ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కృతి శెట్టి, కేథరిన్ లకు అంత ప్రాముఖ్యత దక్కలేదు. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడి ప్రతిభ ఏమాత్రం కనిపించలేదు అని పెదవి విరుస్తున్నారు.
గతంలో వచ్చిన మాస్ చిత్రాలని పోలిన సన్నివేశాలు ఈ మూవీలో కూడా ఉన్నాయని అంటున్నారు. రొటీన్ కథకి ఎన్ని హంగులు చేసినా ఫలితం ఉండదని.. మాచర్ల నియోజకవర్గం చిత్రం అలాంటిదే అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ, సెకండ్ హాఫ్ లో కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో హైలైట్స్ గా చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.