- Home
- Entertainment
- పూర్ణతో లవ్ ఎఫైర్‌పై బాంబ్ పేల్చిన రవిబాబు.. అది నిజమే అంటూ షాక్.. హాట్ టాపిక్
పూర్ణతో లవ్ ఎఫైర్‌పై బాంబ్ పేల్చిన రవిబాబు.. అది నిజమే అంటూ షాక్.. హాట్ టాపిక్
హీరోయిన్ పూర్ణ, నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు కలిసి నాలుగైదు సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ అనేక వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రవిబాబు స్పందించారు పెద్ద షాకిచ్చాడు.

పూర్ణ, దర్శక, నటుడు రవిబాబులది హిట్ కాంబినేషన్. ఆయన రూపొందించిన చిత్రాల్లో పూర్ణ ప్రధానంగా నటించేవారు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తల్లో అప్పట్లో చాలా వినిపించాయి. తాజాగా ఇన్నాళ్లకి దీనిపై రవిబాబు ఓపెన్ అయ్యారు. పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన `అసలు` సినిమాని రవిబాబు రూపొందించారు. ఓటీటీలో విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పూర్ణతో లవ్ ఎఫైర్ పై స్పందించారు. పెద్ద బాంబ్ పేల్చాడు.
రవిబాబు మాట్లాడుతూ పూర్ణతో ఎఫైర్ మాట వాస్తవమే అంటూ షాకిచ్చాడు. `పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంద`న్నారు. అయితే అక్కడే పెద్ద ట్విస్ట్ పెట్టాడు. ఎఫైర్ అంటే మరో విధంగా అనుకోవద్దని, ప్రతి దర్శకుడికి నటులతో అలాంటి అనుబంధాన్నే కలిగి ఉంటాడని తెలిపారు. అయితే ఇలాంటి అనుబంధం ఉండటమే వల్లే నటులతో మంచి నటన రాబట్టుకోగలుగుతామని, వారు మంచి ఔట్‌పుట్ ఇస్తారనేది రవిబాబు ఉద్దేశ్యం. ఇంకా పూర్ణ గురించి చెబుతూ, దర్శకుడు చెప్పేదాన్ని పూర్ణ.. రెండు వందల శాతం బెస్ట్ ఇస్తుందని వెల్లడించారు. ఆమె ప్రొఫేషనల్ యాక్టర్ అని తెలిపారు.
తమ కాంబినేషన్‌లో నాలుగు సినిమాలొచ్చాయని, సహజంగా ఎక్కువ సినిమాలు చేయడంతో ఇలాంటి ఎఫైర్లు వార్తలు వినిపిస్తుంటాయని, కానీ అందులో నిజం లేదనేది ఆయన వెల్లడించారు. `నా సినిమాలో హీరోయిన్ అంటే అంతా పూర్ణానే అనుకుంటారు. కానీ ఆమె అన్ని సినిమాలకు ఓకే చెప్పదు. ఇటీవల నా కొత్త సినిమా ‘వాషింగ్ మెషీన్’ కోసం పూర్ణాను సంప్రదించాం. తనకు నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నో చెప్పింది. తాను ఆ పాత్రకు సరిపోతాను అనుకుంటేనే నటిస్తుంది. నా కోసం అంగీకరించదు` అని తెలిపారు రవిబాబు. రవిబాబు, పూర్ణ కాంబినేషన్‌లో `అవును`, `లడ్డూబాబు`, `అవును2`, `అదిగో`తోపాటు ఇప్పుడు `అసలు` చిత్రాలు వచ్చాయి. ఇందులో `అవును` మాత్రమే హిట్ అయ్యింది. `అసలు` రిజల్ట్ తేలాల్సి ఉంది.
ravibabu
అయితే `అదిగో` సమయంలో పూర్ణతో విభేదాలనే వార్తలు వినిపించాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ, సినిమాలో కీలక పాత్ర కోసం పూర్ణని సంప్రదించానని, ఆమె వెంటనే ఒప్పుకున్నారని, అయితే రెండు రోజుల షూటింగ్ కోసం ఆమె డేట్స్ లేకపోవడంతో నెల రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఆమె ఎట్టకేలకు వచ్చిన పూర్ణతో డే అండ్ ఆఫ్ లో సినిమా షూటింగ్ అయిపోయిందని, కానీ పోస్టర్ డిజైన్ కోసం ఓ స్టిల్ కావాల్సి వచ్చిందట. ఆమెని రివర్స్ లో తాడుకు వేలాడదీయాల్సి ఉంది. అందుకోసం మొదట షూట్ చేయగా, కెమెరాలో చిప్ మర్చిపోయాడని, దీంతో పూర్ణ ఆవేశానికి గురయ్యిందని, తనపై కోప్పడిందని తెలిపారు. అసలు విషయం చెప్పి, ఆమెని నెమ్మదిగా కన్విన్స్ మళ్లీ షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. కెమెరా మెన్ చేసిన తప్పుకి అలాంటి విభేదాలనే వార్తలొచ్చాయి. కానీ అప్పుడు జరిగింది ఇదే అని తెలిపారు రవిబాబు.
పూర్ణ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఆమె గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. అనంతరం ప్రెగ్నెన్సీని ప్రకటించిన పూర్ణ.. గత వారం ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. మరోవైపు రవిబాబు రూపొందించిన `అసలు` మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి మిక్స్ డ్ టాక్ వస్తుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఓ దారుణమైన హత్యను చేధించే పోలీస్ ఆఫీసర్ గా రవిబాబు నటించారు. పూర్ణ.. టీచర్‌గా నటించింది.