- Home
- Entertainment
- HBD Charmi: బర్త్ డే వేళ ఓపెన్ అయిన ఛార్మి... రహస్యంగా ఎంజాయ్ చేయాలంటూ బోల్డ్ పోస్ట్!
HBD Charmi: బర్త్ డే వేళ ఓపెన్ అయిన ఛార్మి... రహస్యంగా ఎంజాయ్ చేయాలంటూ బోల్డ్ పోస్ట్!
ఛార్మి కౌర్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర పోస్ట్ పెట్టారు. జీవితాన్ని రహస్యంగా ఆస్వాదించాలని లేదంటే జనాలు చెడగొడతారంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Charmi Kaur
15 ఏళ్లకే హీరోయిన్ గా మారింది ఛార్మి కౌర్. 2002లో విడుదలైన నీతోడు కావాలి మూవీతో హీరోయిన్ అయ్యారు. గౌరి, మాస్, పౌర్ణమి, రాఖీ, లక్ష్మి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. దర్శకుడు పూరి దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. 2015లో సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది.
దర్శకుడు పూరితో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. నిర్మాత అయ్యాక నటనకు గుడ్ బై చెప్పేసింది. ఇస్మార్ట్ శంకర్ మినహాయిస్తే పూరి కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఈ బ్యానర్ లో జ్యోతిలక్ష్మి మొదటి చిత్రం లైగర్ చివరి చిత్రం. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు.
డబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్ పోతినేని హీరో. 2019లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించింది. దీంతో హిట్ కాంబో రిపీట్ చేస్తున్నారు.
అయితే లైగర్ తలనొప్పులు పూరి-ఛార్మిలను ఇంకా వదల్లేదు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నైజాం ఎగ్జిబిటర్స్, లీజర్స్ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లైగర్ నష్టాల్లో కొంత మొత్తం తిరిగి చెల్లించాలని నిరసన చేస్తున్నారు. మొత్తంగా రూ. 9 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
Charmi Kaur
ఈ టెన్షన్స్ మధ్యే ఛార్మి బర్త్ డే వేడుకలు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. నచ్చిన ప్రదేశాన్ని వెళ్ళండి, నచ్చిన వాళ్ళను ప్రేమించండి, ఆనందంగా జీవించండి... కానీ ఎవరికీ చెప్పొద్దు. జనాలు నాశనం చేస్తారు, అని కామెంట్ పెట్టారు. ఛార్మి పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక పూరి-ఛార్మి సహజీవనం చేస్తున్నారనే వాదన ఉంది. చాలా కాలంగా వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణల్లో ఇద్దరి పేర్లు ఉన్నాయి. రెండు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. లైగర్ విషయంలో ఇటీవల ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు.