వరుణ్ తో లవ్ ఎఫైర్.. అల్లు అరవింద్ ముందే పసిగట్టడంపై లావణ్య కామెంట్స్, ఆయన విజనరీ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందే కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులయ్యారు.
Lavanya Tripathi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందే కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులయ్యారు. ప్రస్తుతం వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఇద్దరూ తిరిగి తమ వృత్తిలో బిజీ అయిపోయారు.
వరుణ్ తేజ్ కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి కూడా కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది పులి మేక అనే వెబ్ సిరీస్ తో అలరించిన లావణ్య త్రిపాఠి త్వరలో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో సందడి మొదలు పెట్టింది. ఫిబ్రవరి 2 నుంచి ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది.
ఈ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా లావణ్య త్రిపాఠి వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఇంటర్వ్యూలో వరుణ్ తో పెళ్లి, కొత్త జీవితం, పెళ్లి తర్వాత కెరీర్ ఇలా అనేక విషయాలు పంచుకుంటోంది.
అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి, వరుణ్ లవ్ ఎఫైర్ గురించి ఎవరికీ తెలియక ముందే కొన్నేళ్ల క్రితమే అల్లు అరవింద్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ ఇక్కడే ఎవరో ఒక అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని అల్లు అరవింద్ సూచించారు.
వరుణ్ తో పెళ్లి తర్వాత అల్లు అరవింద్ చెప్పిందే జరిగింది అని ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. అనేక మీమ్స్ క్రియేట్ చేశారు. అల్లు అరవింద్ కి లావణ్య, వరుణ్ ఎఫైర్ గురించి ముందే తెలిసినట్లుగా ఆయన అప్పట్లో కామెంట్స్ చెసారు. ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ పై క్రియేట్ చేసిన మీమ్ గురించి యాంకర్ లావణ్యని ప్రశ్నించాడు.
లావణ్య, వరుణ్ పెళ్లిని అల్లు అరవింద్ ముందే ఊహించడంపై అల్లు అర్జున్ రియాక్ట్ అయినట్లు మీమ్ క్రియేట్ చేశారు. మా డాడీ విజనరీ అంటూ అల్లు అర్జున్ అంటున్నట్లు ఉన్న మీమ్ అది. దీనిపై లావణ్య బదులిస్తూ.. ఆయన నిజంగానే విజనరీ నాకు తెలుసు. కాకపోతే ఆయనకి తెలియని విషయాన్ని కూడా అలా ఎలా చెప్పారు అని నేను ఇప్పటికి సర్ప్రైజ్ అవుతున్నా అని లావణ్య త్రిపాఠి పేర్కొంది. సినిమా మేకింగ్ లో ఆయన విజన్ చూస్తూనే ఉన్నాం కదా అని లావణ్య త్రిపాఠి పేర్కొంది.