- Home
- Entertainment
- తేజు బర్త్ డే రోజున ప్రేమలో ఉన్నానంటూ ఆ హీరోయిన్ కామెంట్స్.. రొమాంటిక్ ట్వీట్స్ వైరల్
తేజు బర్త్ డే రోజున ప్రేమలో ఉన్నానంటూ ఆ హీరోయిన్ కామెంట్స్.. రొమాంటిక్ ట్వీట్స్ వైరల్
సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి ఇద్దరూ తిక్క చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ కు చెందిన లారిస్సా బోనేసి మోడలింగ్ కోసం ఇండియాకు వచ్చింది.

సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి ఇద్దరూ తిక్క చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ కు చెందిన లారిస్సా బోనేసి మోడలింగ్ కోసం ఇండియాకు వచ్చింది. మోడలింగ్ చేస్తూ తిక్క చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
ఫారెన్ బ్యూటీ కాబట్టి ఆమె అందాలకు యువత ఫిదా అయ్యారు. కానీ తిక్క చిత్రం తేజు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే తేజు, లారిస్సా బోనేసి మంచి స్నేహితులుగా మారారని.. వారిద్దరి ఫ్రెండ్ షిప్ నెక్స్ట్ లెవల్ వరకు వెళ్లిందని అప్పట్లోనే రూమర్స్ వినిపించాయి.
చూస్తుంటే ఆ రూమర్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. గత ఏడాది పీడకల లాంటి బైక్ యాక్సిడెంట్ నుంచి తేజు కోలుకున్నాడు. ప్రస్తుతం తిరిగి సినిమాల్లో నటిస్తూ యాక్టివ్ అయ్యాడు. అక్టోబర్ 15న శనివారం సాయిధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Larissa Bonesi
సాయిధరమ్ తేజ్ ఒక స్పెషల్ పర్సన్ నుంచి రొమాంటిక్ బర్త్ డే విషెస్ అందుకున్నాడు. ఆమె మరెవరో కాదు. తిక్క మూవీ హీరోయిన్ లారిస్సా బోనేసి. ఆమె ట్విట్టర్ లో .. హ్యాపీ బర్త్ డే మే తేజు అని బర్త్ డే విశేష్ తెలిపింది. దీనికి సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. టు మై డిస్ట్రబెన్స్ అని కామెంట్ పెట్టి లవ్ ఎమోజిలు పోస్ట్ చేశాడు.
మళ్ళీ లారిస్సా తిరిగి స్పందించింది.. హ హ హ.. ఎప్పటికీ ఎల్లప్పుడూ అంటూ లారిస్సా కామెంట్స్ పెట్టింది. ఈ సంభాషణ జరిగిన కొంతసేపటి తర్వాత లారిస్సా.. నేను ప్రేమలో ఉన్నా అంటూ మరో ట్వీట్ చేసింది. దీనితో వీరిద్దరి లవ్ ఎఫైర్ పై అనుమానాలు బలపడ్డాయి.
సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైనప్పుడు కూడా లారిస్సా ఎమోషనల్ ట్వీట్ చేసింది. నీ చిరునవ్వు తిరిగి చూడాలనుకుంటున్నా.. నీ మీద నాకు నమ్మకం ఉంది అంటూ ట్వీట్ చేసింది. తేజు, లారిస్సా మధ్య ఉన్న ఈ బాండింగ్ ప్రేమా స్నేహమా అనేది వాళ్లిద్దరే డిసైడ్ చేయాలి. ఇప్పుడు మాత్రం అభిమానులు వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారంటూ పోస్ట్ లు పెడుతన్నారు.