- Home
- Entertainment
- కస్టడీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి.. నిలువెల్లా అందాల ఉప్పెనతో మురిపిస్తున్న బేబమ్మ
కస్టడీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి.. నిలువెల్లా అందాల ఉప్పెనతో మురిపిస్తున్న బేబమ్మ
కస్టడీ చిత్ర యూనిట్ నేడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నాగ చైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాతలు, కృతి శెట్టి, కీలక పాత్రలో నటించిన ప్రియమణి ప్రీరిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు.

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాగ చైతన్య గత కొన్ని రోజులుగా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
త్వరలో రిలీజ్ ఉండడంతో కస్టడీ చిత్ర యూనిట్ నేడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నాగ చైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాతలు, కృతి శెట్టి, కీలక పాత్రలో నటించిన ప్రియమణి ప్రీరిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు. నాగ చైతన్య, కృతి శెట్టి ఇద్దరికీ ఈ చిత్రం కీలకం అనే చెప్పాలి.
గత ఏడాది వరుస పరాజయాలు ఎదురుకావడంతో జోరుమీదున్న కృతి శెట్టికి కాస్త బ్రేక్ పడింది. ఉప్పెన చిత్రంతో కుర్రాళ్ళ హృదయాల్లో
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. గత ఏడాది కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అయితే ఈ ఏడాది కృతి శెట్టి నాగ చైతన్య కస్టడీ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉంది. కృతి శెట్టి కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. రెడ్ డిజైనర్ లెహంగాలో కృతి శెట్టి యువత మైకంలో మునిగిపోయేలా ఆకట్టుకుంది.
ప్రీరిలీజ్ వేడుకలో సరాదాగా మాట్లాడుతూ మెస్మరైజ్ చేసింది. ఇక నాగ చైతన్య కూడా కస్టడీ చిత్రంపై తన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి గ్లామర్ మెరుపులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కస్టడీ చిత్రం వైవిద్యమైన థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. నాగ చైతన్య మాట్లాడుతూ సినిమా 40 వ నిమిషం నుంచి బ్లాస్టింగ్ లాగా ఉంటుంది అని తెలిపారు.