- Home
- Entertainment
- మాకు ఫ్యామిలీలు ఉన్నాయి.. రూమర్స్ వింటే ఇబ్బందిగా ఉంటుంది.. ట్రోలర్స్ కి కృతి శెట్టి క్రేజీ కౌంటర్
మాకు ఫ్యామిలీలు ఉన్నాయి.. రూమర్స్ వింటే ఇబ్బందిగా ఉంటుంది.. ట్రోలర్స్ కి కృతి శెట్టి క్రేజీ కౌంటర్
క్రేజీ బ్యూటీ కృతి శెట్టి ఇటీవల వరుసగా ట్రోల్స్ కి గురవుతుంది. ముఖ్యంగా ఆమె బాడీ షేమింగ్ కామెంట్లని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించింది. మైండ్ బ్లోయింగ్ కౌంటరిచ్చింది.

యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి గతేడాది వరకు తన దూకుడు చూపించింది. వరుస పరాజయాలు ఆమె డీలా పడలే చేశాయి. ఓవర్ నైట్‌లో వచ్చిన స్టార్‌స్టేటస్‌తో సినిమాల ఎంపికలో పొరపాట్లు చేసింది. ఇప్పుడు వాస్తవంలోకి వచ్చిన కృతి శెట్టి.. ఆచితూచి వ్యవహరిస్తుంది. వరుస ఫ్లాపుల అనంతరం ఇప్పుడు బలమైన కథలు,పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంది. అదే సమయంలో గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవుతుందీ కుర్ర బ్యూటీ.
ఇటీవల కాలంలో ఈ అమ్మడు చాలా వరకు ట్రోల్స్ బారిన పడుతుంది. అసలే ఫ్లాపులతో కెరీర్ అయోమయంగా మారుతుంటే, పైగా ట్రోల్స్ ఆమెని ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల కాలంలో కృతి శెట్టిలో వచ్చిన మార్పులు అందుకు కారణం అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఫేస్‌లో(బాడీ షేమింగ్) వచ్చిన మార్పులతో ఆమె ఫ్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే ప్రచారం ఊపందుకుంది. అందం కోసం, మంచి లుక్ కోసం హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం కామనే. అలానే కృతి శెట్టి కూడా చేయించుకుని ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ స్పందించింది. ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అదే సమయంలో వార్తలకు చెక్ పెట్టింది. ఇలాంటి వార్తలు ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదంటూ ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది. `ఉప్పెన` సినిమాలో ఉన్నట్టు ఇప్పుడు లేను, ఎప్పుడూ ఒకేలా ఉండలేమని తెలిపింది. ఏజ్ పెరిగే కొద్ది మనిషిలో మార్పులు వస్తాయి, అందరిలో వచ్చినట్టే తనలోనూ మార్పులు వచ్చాయని చెప్పింది.
కొన్ని సార్లు మేకప్ కారణంగా, హెయిర్ స్టయిల్ కారణంగా ఫేస్‌లు మార్పు కనిపిస్తుంది. అలా కనిపించినంత మాత్రానా అది ఫ్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్టు కాదు అంటూ మండిపడింది. కొంచెం వాస్తవాలు తెలుసుకోవాలని, ఏదైనా కామెంట్ చేసే ముందు ఆలోచించాలని, ఇలాంటి తమని ఇబ్బంది పెడతాయని, తమకు ఫ్యామిలీ ఉంది, వాళ్లూ బాధ పడతారని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా ఘాటుగా కౌంటర్ ఇస్తూనే ఎమోషనల్ టచ్ ఇచ్చి ట్రోలర్స్ నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది కృతి శెట్టి. మరి ఇంతటిలో ఈ బ్యూటీపై కామెంట్లు ఆగుతాయా? అనేది చూడాలి.
కృతి శెట్టి..`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాస్ బస్టర్ హిట్‌ని అందుకుంది. ఓ రకంగా `బోర్న్ విత్ స్టార్` అనే ట్యాగ్‌లైన్‌కి న్యాయం చేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు`, `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, ఇటీవల `కస్టడీ` సినిమాలతో మెరిసింది. `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` ఫర్వాలేదనిపించాయి. కానీ మిగిలిన నాలుగు సినిమాలు బోల్తా కొట్టాయి. ఇప్పుడు మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో కొత్తగా ఇంకా ఏదీ కన్ఫమ్ కాలేదు.