సోషల్ మీడియాలో సత్తా చాటిన కృతీ శెట్టి, అరుదైన రికార్డ్ సాధించిన బేబమ్మ..
సినిమా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సత్తా చాటింది కృతీ శెట్టి. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి.. లక్కీ లెగ్ కాస్తా.. ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుందికృతీ శెట్టి..

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతీ శెట్టి.. ఈసినిమాతో తనకంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతే కాదు వరుస అవకాశాలు కూడా సాధించింది బ్యూటీ. ఉప్పెన తరువాత వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఆతరువాత వరుసగా ఫెల్యార్స్ ఫేస్ చేసింది.
ఉప్పెన హిట్ తరువాత స్టార్ హీరోల చూపు ఆమెమీద పడటం.. స్టార్ మేకర్స్ కృతీ కోసం ఆరటపడటం వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది బ్యూటీ. నానీతో శ్యామ్ సింగరాయ్ లో.. లిప్ లాక్.. బెడ్ సీన్ తో అదరగోట్టింది కృతీ శెట్టి. ఈమూవీ హిట్ అయ్యింది. ఆతరువాత ది వారియర్ తో ప్లాప్ లు మొదలయ్యి.. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కష్టడీ సినిమాల వరకూ అననీ ప్లాప్ లే పడ్డాయి కృతీకి. అంతే కాదు టాలీవుడ్ లో అవకాశాలు కూడా కోల్పోయింది బ్యూటీ.
ఇప్పుడిప్పుడు కోలుకుని అవకాశాలు సాధిస్తోంది కృతీ శెట్టి. తాజాగా తమిళంలో జయం రవితో ఓ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో మరో సినిమా చేస్తుంది. టాలీవుద్ నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది కృతీ శెట్టికి. ఇక పోతే.. కృతీ శెట్టికి సినిమాలు ఉన్నా లేకపోయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ రేర్ ఫీట్ ను సాధించింది బ్యూటీ.
మైమరపించే సోకులతో నెట్టింట్ల రచ్చ చేస్తోంది బ్యూటీ.. చిరునవ్వుతో ఉన్న కృతి శెట్టిని ఇలా చూస్తే కుర్రాళ్లు మాయలో మునిగిపోతారు. నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ ఉప్పెన పిల్ల రచ్చ రచ్చ చేస్తోంది. వరుసగా వస్తున్న పరాజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి పరువాలు ఒలకబోస్తోంది.
అందాల ఆరబోతతో.. సోషల్ మీడియాలో కృతి శెట్టి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. భారీ సంఖ్యంలో ఫాలోవర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కృతిశెట్టి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరుకుంది. తక్కువ టైంలోనే ఈ అరుదైన మైల్ స్టోన్ ను కృతిశెట్టి చేరుకుంది. ఈ ఫాలోయింగ్ చూసి అయినా.. ముందు ముందు ఆమెకు ఆఫర్స్ వస్తాయోమో చూడాలి.