- Home
- Entertainment
- Krithi Shetty: ఎల్లో డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న కృతి శెట్టి.. తానే విజిల్స్ వేస్తానంటూ ఫన్నీ కామెంట్..
Krithi Shetty: ఎల్లో డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న కృతి శెట్టి.. తానే విజిల్స్ వేస్తానంటూ ఫన్నీ కామెంట్..
`ఉప్పెన`తో సంచలనంగా మారింది కృతి శెట్టి. ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ భామ లేటెస్ట్ ఫోటోలు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

`ఎప్పెన`, `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో విజయాలు అందుకున్న కృతి శెట్టి(Krithi Shetty) ఇప్పుడు `ది వారియర్` (The Warriorr Movie) చిత్రంలో నటించింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌పోతినేని హీరోగా నటించిన చిత్రమిది. లింగుస్వామి తెలుగు, తమిళంలో రూపొందించారు. ఈ నెల(జులై) 14న ఈ సినిమా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కృతి శెట్టి బిజీగా గడుపుతుంది. అందులో భాగంగా వరుస ఫోటో షూట్లు, ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తుంది.
తాజాగా ఆమె లైట్ ఎల్లో కలర్ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. టాప్ యాంగిల్స్ నుంచి అందాలు చూపిస్తూ కట్టిపడేస్తుంది. ఈ అమ్మడి నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. క్యూట్, హాట్ మేళవింపుతో కృతి అందాల కట్టిపడేసేలా ఉన్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఉండటం విశేషం.
ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కృతి శెట్టి మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు యాక్షన్ సినిమాలు చేయాలని ఉందని తెలిపింది. మున్ముందు అలాంటి పాత్రలు పోషిస్తానని పేర్కొంది. మరోవైపు `ది వారియర్` సినిమా చూశాక ఆడియెన్స్ రెస్పాన్స్ ని చూసి తాను విజిల్స్ వేస్తానని చెప్పడం విశేషం.
`ది వారియర్` సినిమా గురించి చెబుతూ, ఇందులో తాను విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తానని వెల్లడించింది. పక్కింటి అమ్మాయిలా తన పాత్ర ఉంటుందని, తను ఆర్జేగా పనిచేస్తుంటానని తెలిపింది. రామ్.. సత్య అనే పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. పూర్తి కమర్షియల్ చిత్రమిదని చెప్పింది.
`బుల్లెట్` సాంగ్ మిలియన్స్ వ్యూస్ రాబట్టడంపై స్పందిస్తూ, `షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. రామ్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. నేను కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. 'బుల్లెట్...' సాంగ్ క్లాస్ అయితే 'విజిల్...' సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను. కొంచెం స్టయిలిష్ అంటే 'బుల్లెట్...' సాంగ్` అని పేర్కొంది.
హీరో రామ్ గురించి చెబుతూ, రామ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారని, ఆయనతో మ్యాచ్ కష్టమనిపించింది,కొంచెం నెర్వస్ ఫీలయ్యా. కానీ ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొంది. `బుల్లెట్` సాంగ్ చూసి చాలా మంది మా పెయిర్ బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. రామ్ ఉండేది పోలీస్ స్టేషన్, నేను రేడియో స్టేషన్, మధ్యలో రైల్వే స్టేషన్ అక్కడ తమ లవ్ పుట్టిందని చెప్పింది కృతి.
దర్శకుడు లింగుస్వామి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు అని, ఆయనకు ఏం కావాలో అదే తీసుకుంటారు. కొన్ని సార్లు ఎలా నటించాలో కూడా చేసి చూపిస్తారని తెలిపింది. రామ్ తర్వాత నదియాతో ఎక్కువగా తనకు సన్నివేశాలుంటాయని, నదియా చాలా రాయల్ గా ఉంటారని పేర్కొంది. ఈ సినిమా థియేటర్‌లో ఆడియెన్స్ విజిల్స్ వేసేలా ఉంటుందని, ఆడియెన్స్ ని చూసి తాను విజిల్స్ వేస్తానని పేర్కొంది కృతి శెట్టి.
`ఉప్పెన` తర్వాత కోలీవుడ్ నుంచి కూడా ప్రశంసలు దక్కినట్టు తెలిపింది. అది తాను ఊహించలేదని, అంత ప్రేమ చూపిస్తారని ఎక్స్ పెక్ట్ చేయలేదని, చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని, ఇప్పుడు తమిళంలో ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం సూర్య-బాల కాంబినేషన్‌లో వస్తోన్న తమిళ చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపింది. దీంతోపాటు నాగచైతన్య, వెంకట్‌ప్రభు కాంబినేషన్‌లో వస్తోన్న తెలుగు, తమిళం బైలింగ్వల్ కూడా చేస్తున్నాని పేర్కొంది కృతి శెట్టి.
ఇక తనకు ఇలాంటి పాత్రలు చేయాలనే కండీషన్స్ పెట్టుకోలేదని, ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ప్రతి పాత్ర చేస్తానని తెలిపింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కథలు ఇంకా ఏవి వినలేదని, భవిష్యత్‌లో యాక్షన్ మూవీస్ చేయాలని ఉందని పేర్కొంది. నెక్ట్స్ తెలుగులో `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` వంటి సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది.