- Home
- Entertainment
- Krithi Shetty: బార్బీ డాల్ కూడా ఇంత అందంగా ఉండదేమో.. పింక్ డ్రెస్‌లో బేబమ్మ హల్ చల్..
Krithi Shetty: బార్బీ డాల్ కూడా ఇంత అందంగా ఉండదేమో.. పింక్ డ్రెస్‌లో బేబమ్మ హల్ చల్..
టాలీవుడ్ బేబమ్మా కృతి శెట్టి నెమ్మదిగా మళ్లీ పుంజుకుంటుంది. దీనికితోడు ఆమె డోస్ పెంచుతుంది. సోషల్ మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ట్రీట్ ఇచ్చింది కృతి.

బేబమ్మగా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది కృతి శెట్టి. ఆ తర్వాత ఇండస్ట్రీని ఊపేసింది. రెండేళ్లపాటు అత్యంత బిజీ హీరోయిన్‌గా మారింది. యంగ్ హీరోలందరితోనూ ఆడిపాడింది. తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంది. కానీ వరుస పరాజయాలు కృతి శెట్టి కెరీర్‌ని తలకిందులు చేశాయి. ఎంత ఫాస్ట్ గా లేచిందో, అంతే ఫాస్ట్ గా పడిపోయింది.
సక్సెస్ క్రేజ్‌లో వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ వెళ్లి బోల్తా కొట్టింది.ఇప్పుడు ఆగి ఆలోచిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అదే సమయంలో ఆమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. లేట్‌గా వచ్చినా, కంటెంట్ ఉన్న మూవీస్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె కాస్త కొత్త సినిమాల విషయంలో వెనకా ముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే అవకాశాల వేటలో మాత్రం సినిమా ఇండస్ట్రీ ట్రెండ్‌ని ఫాలో అవ్వాలని లేట్‌గా తెలుసుకుంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. సినిమా అంటేనే గ్లామర్. ఆ షో లేకపోతే ఆదరణ తగ్గిపోతుంది. గ్లామర్ షో అందరి అటెన్షన్ వారిపై పడేలా చేస్తుంది. అది సినిమా అవకాశాలు రావడంలో కీలక భూమిక పోషిస్తుంది.
చాలా మంది హీరోయిన్లు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్లు అయ్యారు. కృతి శెట్టి కూడా ఇదే ఫాలో అవుతుంది. గ్లామర్ షో చేసింది. నెమ్మదిగా డోస్ పెంచుతూ అలరిస్తుంది. అందాల ఫోటో షూట్లతో నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది.
కృతి శెట్టి అందులో భాగంగా ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. బార్బీ డాల్‌లా మారిపోయింది. పింక్ డ్రెస్‌లో బార్బీ డాల్‌లా మారి హోయలు పోయింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చింది.
బార్బీ డాల్ కూడా ఇంత అందంగా ఉండదేమో అనేంతగా కృతి శెట్టి మెప్పించడం విశేషం. ఆమె అందంతో, క్యూట్ పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తీరైన పోజులతో మతిపోగడుతుంది. నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయిన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. దీంతో దెబ్బకి వరుసగా ఐదారు సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఏ ఒక్కటి హిట్ కాలేదు.
నానితో చేసిన `శ్యామ్ సింగరాయ్` ఫర్వాలేదు. నితిన్ తో చేసిన `మాచర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబుతో చేసిన `ఆ అమ్మాయి గురించి చెప్పాలి`, రామ్‌తో నటించిన `ది వారియర్స్`, నాగచైతన్యతో చేసిన `బంగర్రాజు`, `కస్టడీ` చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది కృతి.
టాలీవుడ్ బేబమ్మా కృతి శెట్టి నెమ్మదిగా మళ్లీ పుంజుకుంటుంది. దీనికితోడు ఆమె డోస్ పెంచుతుంది. సోషల్ మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ట్రీట్ ఇచ్చింది కృతి.