MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Krithi Shetty: `ఉప్పెన` చూసి స్టార్‌ హీరో గిఫ్ట్ పంపించాడు.. తన సీక్రెట్ నిక్ నేమ్‌ చెప్పిన బేబమ్మ

Krithi Shetty: `ఉప్పెన` చూసి స్టార్‌ హీరో గిఫ్ట్ పంపించాడు.. తన సీక్రెట్ నిక్ నేమ్‌ చెప్పిన బేబమ్మ

`ఉప్పెన` సినిమా చూసి ఓ పెద్ద స్టార్‌ హీరో ఫ్లవర్‌ బోకే తోపాటు ఓ గిఫ్ట్ కూడా పంపించాడని చెప్పింది కృతిశెట్టి. అంతేకాదు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ నిక్‌ నేమ్‌ని రివీల్‌ చేసింది. అందరికి షాక్‌ ఇచ్చింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 11 2022, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

కృతి శెట్టి `ఉప్పెన` చిత్రంతో ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. బేబమ్మగా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా కుర్రాళ్ల హృదయాల్లో బేబమ్మగా ప్రింట్‌ అయిపోయింది. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయిన ఈ అందాల సోయగం ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది. అందులో భాగంగా `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంతో కనువిందు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఇప్పుడు `బంగార్రాజు` చిత్రంతో సంక్రాంతి సందర్భంగా రాబోతుంది. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనువిందు చేయబోతుంది కృతి శెట్టి. కళ్యాణ్‌ కృష్ణ దీనికి దర్శకుడు. 

311

ఇదిలా తాజాగా కృతి శెట్టి `అలీతో సరదాగా` షోలో పాల్గొంది. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో కలిసి ఆమె సందడి చేసింది. అందులో భాగంగా కృతి శెట్టి ముద్దు పేరుని బయటపెట్టాడు అలీ.  కృతి ముద్దు పేరు `బుంగి` అని చెప్పాడు. దీంతో షాకైనా కృతి మీకెలా తెలుసు అని అడగ్గా, మరో పేరు కూడా ఉందన్నాడు. కాకపోతే దాన్ని మాత్రం అర్థమై కానట్టుగా చెప్పడం విశేషం. దీనిపై దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ స్పందిస్తూ, ఆమె చాలా పేర్లున్నాయి. మేం పెట్టిన పేరు `కే.కే` అని తెలిపారు. `కృతి కృష్ణ` అని తనే చెప్పేసింది కృతి. 

411

మరోవైపు అలీ..కృతిని ఓ షాకింగ్‌ ప్రశ్న అడిగారు. ఇంత అందంగా పుట్టేందుకు మీ ఊర్లో ఏమైనా అమ్ముతారా? అని అడగ్గా, `అవును నీళ్లలో ఏదో మిక్సయ్యింది` అని కృతి చెప్పడం నవ్వులు పూయించింది. సినిమాల్లోకి రాకముందు పలు కంపెనీలకు ప్రకటల్లో నటించారటగా అని అడగ్గా, తాను 25 ప్రొడక్ట్ ల యాడ్స్ లో నటించానని తెలిపింది. అయితే మొదటగా తాను బిస్కేట్‌ యాడ్స్ లో చేశానని చెప్పడంతో పక్కనున్న దర్శకుడు నవ్వులు పూయించారు. చాక్లెట్‌, బిస్కేట్స్ అంటూ ఆటపట్టించాడు. 

511

ఇక ఎవరికైనా వేశారా బిస్కెట్‌ అని అలీ ప్రశ్నించారు. దీంతో లేదు లేదు అంటూ కృతి ఇచ్చిన రియాక్షన్‌ ఆకట్టుకుంటుంది. మీకు ఎవరైనా వేశారా బిస్కెట్‌ అని అడగ్గా, లేదని సమాధానం చెప్పింది కృతి. దీంట్లో కళ్యాణ్‌ కృష్ణ కల్పించుకుని రెగ్యూలర్‌గా జరుగుతూనే ఉంటాయని చెప్పగా, పక్కనుండి క్రీమ్‌ బిస్కెట్‌ అనే శబ్దం రావడం మరింతగా నవ్వులు పూయించింది.

611

ఆ తర్వాత `ఉప్పెన` హిట్‌ అయిన తర్వాత టాలీవుడ్‌లో ఓ పెద్ద హీరో బోకేతోపాటు పెద్ద గిఫ్ట్ కూడా పంపించారట. ఎవరాయనా? అని ప్రశ్నించాడు అలీ. అందుకు కృతి రియాక్ట్ అవుతూ పేరు చెప్పేందుకు తడబడినట్టుగా కనిపించింది. ఆయన బోర్న్ స్టార్‌ అని చాలా మంచి మాటలు రాశారని తెలిపింది కృతి. ఆయన పక్కన హీరోయిన్‌ గా ఛాన్స్ వస్తే చేస్తావా? అని అడగ్గా, అంటే అది అంటూ తటపటాయించింది కృతి.

711

బ్రహ్మానందం అంటే ఇష్టమని చెప్పిన కృతి.. ఆయనలా యాక్ట్ చేసి చూపించింది. మరోవైపు ఏ హీరోతో యాక్ట్ చేయాలనే డ్రీమ్‌ ఉందనే ప్రశ్నకి.. ఆమె సమాధానం చెప్పలేదు. మధ్యలో దర్శకుడు కల్పించుకుని ఇప్పుడు స్మార్ట్ ఆన్సర్‌ బయటకు వస్తుందని చెప్పడం నవ్వులు పూయించాయి.  `ఉప్పెన`లో బేబమ్మవెంట హీరో పడ్డట్టు రియల్ లైఫ్‌లో ఎవరైనా పడ్డారా ? అని ప్రశ్నించగా, లేదంటూ సమాధానం చెప్పింది. పడకుండా ఎవరుంటారు అని దర్శకుడు చెప్పారు. 

811

సంక్రాంతి స్పెషల్‌గా వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో కృతి గురించిన అనేక సీక్రెట్స్ బయటకు రాబోతున్నాయని తెలుస్తుంది.

911

మరోవైపు మంగళవారం ఇంటర్వ్యూలో `బంగార్రాజు` సినిమా గురించి చెబుతూ, ఇది తనకు చాలా స్పెషల్‌ అని తెలిపింది. `నాకు ముందే డాన్స్ అంటే చాలా ఇష్టం. అయినా ఈ సినిమాలో ఈ సాంగ్ కి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఆడియెన్స్ కోసం బాగా చేయాలనుకున్నా.  సాంగ్ వింటున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. అలాగే షూట్ లో కూడా మంచి ఎంజాయ్ చేసి చేశాన`ని తెలిపింది.

1011

`నేను ఈ సినిమాకి ఓకే చెప్పినప్పుడు నాగార్జున, చైతన్య లతో సినిమా అని కాస్త భయపడుతూనే ఓకే చేశాను. వాళ్ళు నాతో ఎలా ఉంటారు ఎలా డీల్ చేస్తారో అని భయపడ్డాను. కానీ ఇద్దరూ కూడా నాకు నైస్ వెల్కమ్ అందించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇద్దరూ కూడా జెంటిల్ మెన్స్ అంతే` అని తెలిపింది కృతి. 

1111

కోవిడ్‌ జాగ్రత్తలు తెలిపిన కృతి `ప్రస్తుతం అయితే డిఫరెంట్ రోల్స్ నాకు వస్తున్నాయి ఈ విషయంలో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా రామ్ తో ఒక సినిమా, మాచర్ల నియోజకవర్గం అలాగే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తున్నాను` అని చెప్పింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved