MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ డైరెక్టర్ వల్ల షూటింగ్ లో ఇబ్బంది పడిన కృతిశెట్టి, ఏం చేసిందంటే..?

స్టార్ డైరెక్టర్ వల్ల షూటింగ్ లో ఇబ్బంది పడిన కృతిశెట్టి, ఏం చేసిందంటే..?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  స్టార్ డైరెక్టర్ లింగు స్వామి వల్ల తాను ఇబ్బంది పడ్డానంటోంది బ్యూటీ. ఇంతకీ అంతాలా కృతిని ఆయన ఏం ఇబ్బంది పెట్టాడు...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 04 2023, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి.  బేబ్బమ్మగా పాపులర్ అయిన కృతి వరుస సినిమాలు హిట్ కొట్టి.. హాట్రిక్ సక్సెస్ తో దూసుకుపోయింది.  చిన్న వయస్సులోనే అంటే 20 ఏళ్లు నిండకుండానే స్టార్ డమ్ చూసిన ఈ చిన్నది.. ఇప్పుడు రేసులో వెనకబడిపోయింది. 

26

వరుస సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి.. కుర్రాళ్ల చేత తన అందంతో  కేక పెట్టించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం అల్లాడి పోతుంది. తెలుగులో వరుసగా నాలుగు హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోయింది. రీసెంట్ గా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కృతి శెట్టి. 

36

ఆమధ్య  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఓ సినిమా షూటింగ్ లో ఎదురైన చిత్ర విచ్రమైన అనుభవాన్ని పంచుకుంది బ్యూటీ.ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా తాను  ఇబ్బంది పడ్డట్లు తెలిపింది బేబమ్మ. ఇంటర్వ్యూలో  ఆమె మాట్లాడుతూ.. నా మాతృభాష తుళు.. అయితే తెలుగు సినిమాలు చేయడం మూలంగా తెలుగు  బాగానే మాట్లాడతాను. కాని నాకు తమిళం అస్సలు రాదు అన్నారు కృతి శెట్టి. 

46
Lingusamy

Lingusamy

ది వారియర్ మూవీ చేస్తున్నప్పుడు.. ఆ సినిమా దర్శకుడు లింగుసామిగారికి తెలుగు వచ్చు కాని.. ఆయన  తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు ఆ తమిళ్ మిక్స్ తెలుగు  అసలు అర్ధం అయ్యేది కాదు. తమిళ్  తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదని తెలిపింది. ఇలా ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చిందంటోంది బ్యూటీ. 

56

ఈసినిమా హీరో రామ్ కి తమిళం బాగా వచ్చు. అందువలన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అన్నారు కృతి శెట్టి. ఇక తరువాత రోజుల్లో రామ్  సపోర్ట్ తీసుకున్నాను కాబట్టే ఈమూవీ కంప్లీట్ చేయగలిగాను అన్నారు కృతి శెట్టి.  ఆతువాత తరువాత... ఆమె కూడా లింగుసామి తెలుగు యాసకు అలవాటు పడిపోయానని తెలిపింది. 

66

ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది. వరుసగా ఆఫర్లు సాధించింది. కాని ప్రస్తుంతం  సినిమాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఇమేజ్ పెంచుకునే పనిలో పడింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆడపడుచు మృతి.. 30 ఏళ్లకే మాయా కిబెల్ ఎలా కన్నుమూసిందంటే?
Recommended image2
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్త ఏం చేస్తాడు? ఎక్కడ కలుసుకున్నారు? ఎంతకాలం ప్రేమించుకున్నారు?
Recommended image3
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved