Krithi Shetty: కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన బేబమ్మ.. స్మోక్ చేయడంపై క్లారిటీ..
ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది కృతి శెట్టి. టాలీవుడ్ బేబమ్మ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. కెరీర్ ప్రారంభించి నిండా మూడేళ్లు కూడా కాలేదు. అప్పుడే పెళ్లి గురించి డిసైడ్ అయ్యిందట.

కృతి శెట్టి తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో నిర్ణయించుకుందట. తాజాగా ఆ విషయాలను బయటపెట్టింది. తనకు కాబోయే వాడు సింపుల్‌గా ఉండాలట. అంతేకాదు బొద్దుగా ఉండాలట. హంగామా తను ఇష్టపడదట. డౌట్ టూ ఎర్త్ లా ఉండాలని ఆమె వెల్లడించింది. ప్రస్తుతానికి ఆమె తన రెండు లక్షణాలు వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు స్పందిస్తూ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం అలాంటి క్వాలిటీస్ మాలో ఉన్నాయని కామెంట్లు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కృతి శెట్టి `శ్యామ్ సింగరాయ్` చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది. ఆమె స్మోకింగ్ చేసింది. ఈ సీన్లలో నటించడంపై కృతి శెట్టి స్పందించింది. సిగరెట్ తాగే సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు మొదట చేతులు వణికాయట. తనకు స్మోకింగ్ నచ్చదని, సీన్ కోసం దర్శకుడు పొగాకు లేని సిగరెట్లు తెప్పించాడట, మూడు రోజులు సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేసి ఆ సీన్‌లో నటించినట్టు చెప్పింది కృతి. అంతేకాదు కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసి స్మోకింగ్ ఎక్స్‌ప్రెషన్లు నేర్చుకున్నట్టు వెల్లడించింది.
కృతి శెట్టి ఇటీవల `కస్టడీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో వరుసగా నాల్గో ఫ్లాప్ ఆమె ఖాతాలో చేరింది. ఎంత వేగంగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుందో ఇప్పుడు అంతే వేగంగా పడిపోతుంది. దీంతో ప్రస్తుతం కృతి కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇదిలా ఉంటే `కస్టడీ` సినిమా ప్రమోషన్స్ లో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది కృతి.
సెలబ్రిటీలు చాలా వరకు వీకెండ్స్ లో పార్టీలు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కృతి శెట్టికి పార్టీలు నచ్చవట. షూటింగ్ మధ్యలో బ్రేక్ దొరికితే, తన మదర్‌తో కలిసి ముంబాయికి వెళ్ళిపోతుందని, అక్కడ ఫ్యామిలీతో సరదాగా గడుపుతామని చెప్పింది. ఇంట్లో తాను చాలా అల్లరి పిల్ల అట. కానీ బయట మాత్రం సైలెంట్‌గా ఉంటానని చెప్పింది కృతి శెట్టి.
`ఉప్పెన` సినిమా చూశాక చిరంజీవి తనకి ఓ గిఫ్ట్ పంపించాడు. ఆ గిఫ్ట్ తోపాటు లెటర్ కూడా పంపారని, ఆ లెటర్‌లో `యూ ఆర్ ఏ బోర్న్ స్టార్` అని రాసి ఉందని చెప్పింది. అది చూసి భావోద్వేగానికి గురైనట్టు చెప్పింది. అంతేకాదు దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుందట. మరోవైపు `జయం` సినిమాలో `రాను రానంటూనే సిన్నదో` పాట తాను స్కూల్‌లో ఉన్నప్పుడు విన్నానని, చాలా బాగా నచ్చిందని, ఎప్పుడూ వింటూనే ఉంటానని తెలిపింది. అయితే అలాంటి పాట రీమిక్స్ లో స్టెప్పులేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పింది. `మాచర్ల నియోజకవర్గం`లో నితిన్‌తో కృతి నటించింది. అందులో ఈ పాటని రీమిక్స్ చేశారు.