కృతి శెట్టి సంచలన నిర్ణయం.. అక్కడికి వెళ్లను, అలాంటి సినిమాలు చేయనన్న బ్యటీ...
తన మూవీ కెరీర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది హీరోయిన్ కృతి శెట్టి. తను ఏ సినిమాలు చేస్తాను..? ఏ ఇండస్ట్రీలోకి వెళ్తాను, ఎలాంటి కథలు సెలక్ట్ చేసుకుంటాను అనే విషయంలో పక్కా స్కెచ్ లో ఉంది బ్యూటీ. ఇంతకీ కృతి ఏమంటుంది. ..?

మొదటి సినిమాతోనే సూప్ డూపర్ హిట్ కొట్టి.. వరుసగా హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన తో మొదలు పెట్టి వరుసగా శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ యంగ్ స్టార్ హీరోయిన్ కు పట్టుమని 19 ఏళ్లు ఉన్నాయంతే. ఇంత చిన్న వయస్సులోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది కృతి శెట్టి.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన కృతికి ఆఫర్స్ బాగానే వచ్చాయి. కానీ రీసెంట్ గా ది వారియర్ మూవీ మాత్రం కృతిని నిరాశ పరిచింది. ఇక మరోసారి తన అదృష్టం పరిక్షించుకోబోతోంది కృతి శెట్టి. నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 12న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
ప్రస్తుతం బేబమ్మ యంగ్ హీరో నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో వేరియేషన్ చూపిస్తున్న ఈ బ్యూటీ.. ఈ చిత్రంలో సరికొత్తగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో కృతి శెట్టి ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలిస్తోంది బ్యూటీ. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు శేర్ చేసుకుంది బ్యూటీ. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గతంలోనే కమర్షియల్ సినిమాలు చేశాను.. ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ కి కూడా ఓకే అని చెప్పిన కృతి మరోసారి తాను చేయాలనుకున్న పాత్రలపై క్లారిటీ ఇచ్చింది.
అయితే తాజా ఇంటర్వ్యూలో కృతిశెట్టి మాట్లాడుతూ.. నేను చేసే కమర్షియల్ పాత్రల్లో కూడా కొత్తదనం ఉండాలి అనుకుంటున్నాను. ఉప్పెన లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే శ్యామ్ సింగరాయ్ లో మోడ్రన్ క్యారెక్టర్ చేశాను. ఉప్పెనలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిగారితో కలిసి నటించాక ఆయనలాగే విలక్షణ పాత్రలు చేయాలని ఫిక్స్ అయ్యానన్నారు కృతి.
కృతి శెట్టి నుంచి వరుసగా కమర్షియల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే తాను ఇక ముందు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తానంటోంది. ముఖ్యంగా సూర్య , అచలుడు, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో డిఫరెంట్ పాత్రాల్లో కనిపిస్తానని చెప్పుకొచ్చింది కృతి.
ఇక ఇప్పట్లో బాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచన లేదు అంటోంది. ముందు సౌత్ లో గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తుంది చిన్నది. అంతే కాదు తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అస్సలు చేయనంటోంది. తన సినిమాలు చూసి ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలి కాని.. సినిమా సక్సెస్ అయ్యిందా..? లేక ప్లాప్ అయ్యిందా అనేది అస్సలు ఆలోచించను అంటోంది.
Krithi Shetty
ఇంకా కృతి మాట్లూడుతూ.. త్వరలోనే మరిన్ని సినిమాలతో మీ ముందుకి వస్తాను. అంతే కాదు కొన్ని మంచి పనులు చేయాలి అనే ఆలోచన కూడా ఉంది. భవిష్యత్తులో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అంటోంది కృతి శెట్టి.
అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన ఆడియన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కృతిని లేడీ ఓరియెంటెడ్ రోల్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే అని చెప్పొచ్చు. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా ఎప్పుడు బాలీవుడ్ చెక్కేద్దామా అని చూస్తుంటే కృతి మాత్రం తాను అసలు బాలీవుడ్ సినిమాలు చేయను అనడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. ఆడియన్స్ కూడా ఆశ్చర్య పోతున్నారు.