కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం వెళితే.. హాస్పిటల్ కి వెళ్లి ఆర్డర్ వేసిన ఉపాసన, ఆమె బిహేవియర్ పై కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్, కోడలు ఉపాసన కొణిదెల గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు రెండేళ్ల క్రితం మరణించారు. ప్రభాస్ కి పెదనాన్న అంటే ఎంతో ప్రేమ ఉంది. పలు సందర్భాల్లో వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు చూశాం. కృష్ణం రాజు చిత్ర పరిశ్రమలో అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణం రాజు, చిరంజీవి ఇద్దరూ మొగల్తూరుకి చెందినవారే.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్, కోడలు ఉపాసన కొణిదెల గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు కృష్ణంరాజు గారికి. రాంచరణ్ అన్నా, ఉపాసన అన్నా ఎంతో ఇష్టం అని శ్యామల దేవి తెలిపారు.
ఒకసారి కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం అపోలో ఆసుత్రిలో జాయిన్ అయ్యారు. వెంటనే ఉపాసన ఆసుపత్రికి వచ్చి పరామర్శించింది. అంతే కాదు కృష్ణంరాజు గారిని బాగా చూసుకోవాలి అని సిబ్బందికి ఆర్డర్ వేసి వెళ్ళింది. ఉపాసన ప్రవర్తన, పెద్దలకి ఆమె ఇచ్చే గౌరవం చూసి ముచ్చటగా అనిపించింది అని శ్యామల దేవి అన్నారు.
ఉపాసన నాకు కూతురు లాంటిది అని కృష్ణంరాజు గారు అన్నారు. చిరంజీవి గారు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పా.. మీరు చాలా అదృష్టవంతులు..అంత మంచి కొడుకు, కోడలు ఉన్నారు అని చెప్పారట. చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇక చరణ్ కి కూడా మేమంటే అమితమైన గౌరవం. ఎక్కడ కనిపించినా ఆంటీ అంటూ వచ్చి పలకరిస్తాడు అని శ్యామల దేవి అన్నారు. చరణ్ చాలా మంచి అబ్బాయి అని శ్యామల దేవి ప్రశంసించారు.