అన్ స్టాపబుల్-2లో కృష్ణం రాజు స్పెషల్ ఏవీ.. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ.. కంటతడి పెట్టుకున్న ప్రభాస్!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా హాజరయ్యారు. షోలో దివంగత కృష్ణం రాజును గుర్తు చేస్తూ స్పెషల్ ఏవీ ప్రదర్శించగా.. డార్లింగ్ బాగా ఎమోషనల్ అయ్యారు.
‘ఆహా’లో ప్రసారం కానున్న ‘అన్ స్టాపబుల్ 2’ లేటెప్ట్ ఎపిసోడ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పటికే నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన హోస్టింగ్ తో అదరగొడుతున్నారు. టాలీవుడ్ స్టార్స్ ను షోలో దింపుతూ బుల్లితెరపై రచ్చ చేస్తున్నారు.
మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో.. వెంటనే మరింత ఎనర్జిటిక్ గా సెంకడ్ సీజన్ డిజైన్ చేసి ప్రారంభించారు. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ‘అన్ స్టాపబుల్ 2’లో యంగ్ స్టార్స్ తో పాటు పొలిటీషన్లను ఆహ్వానిస్తూ టీవీ ఆడియెన్స్ ను కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆరో ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరియు గోపీచంద్ (Gopichand)ను ఆహ్వానించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, స్పెషల్ గ్లింప్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా Unstoppable 2 promo ను కూడా విడుదల చేశారు.
అయితే, ప్రొమోలో దివంగత కృష్ణం రాజు (Krishnam Raju)పై స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని షో తరుపున మౌనం పాటించారు. ఈ సందర్భంగా డార్లింగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకుంటూ పెద్దనాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. ‘శత్రువు ఇంటికి వచ్చినా మర్యాద ఇవ్వాలని, కోపతాపాలన్నీ బయట చూసుకోవాలని’ కృష్ణం రాజు నిత్యం చెప్పేవాడన్నారు. ఆయనంటే తనకెంతో ఇష్టమని ప్రభాస్ కంటతడి పెట్టుకుంటూ చెప్పాడు. దీంతో షోలో కాసేపు నిశబ్దం ఏర్పడింది. కృష్ణం రాజు 2022 సెప్టెంబర్ 11న మరణించారు. ఆయన అభిమానులకు సొంతగ్రామంలో ప్రభాస్ భోజనాలు కూడా ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే.
ఇక షోలో ప్రభాస్, గోపీచంద్ లతో బాలయ్య ఓ ఆటాడేసుకున్నారు. ముఖ్యంగా మొదటిసారి పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ బుల్లితెరపై అడుగుపెట్టడంతో ఆసక్తికరమైన విషయాలను రాబట్టే ప్రయత్నం చేసినట్టు చేశారు. ముందుగా ప్రభాస్ ను ఆహ్వానించి, ఆ తర్వాత గోపీచంద్ కు వెల్ కమ్ చెప్పారు. తనదైన శైలిలో వారిద్దరిపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. డిసెంబర్ 30న ఆహాలో ప్రసారం కానుంది.