- Home
- Entertainment
- రమ్యకృష్ణతో విడిగా ఉండటంపై ఎట్టకేలకు రియాక్ట్ అయిన కృష్ణవంశీ.. గాసిప్ లపై షాకింగ్ కామెంట్
రమ్యకృష్ణతో విడిగా ఉండటంపై ఎట్టకేలకు రియాక్ట్ అయిన కృష్ణవంశీ.. గాసిప్ లపై షాకింగ్ కామెంట్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందంటూ వార్తలొచ్చాయి. వాటిపై తాజాగా కృష్ణవంశీ స్పందించారు. షాకింగ్ కామెంట్లు చేశారు.

స్టార్ హీరోయిన్, గ్లామర్ తారగా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది రమ్యకృష్ణ(Ramya Krishnan). టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ అదరగొట్టింది. `బాహుబలి`తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రమ్యకృష్ణ బలమైన కీలక పాత్రలు పోషిస్తూ రాణిస్తుంది. ఇటీవల `లైగర్`తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో ఆమె డేరింగ్ రోల్‌లో అదరగొట్టింది.
మరోవైపు భర్త దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi) డైరెక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల సక్సెస్ లేని ఆయన ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నారు. ఎలాగైనా సక్సెస్ కొట్టేందుకు తపిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న `రంగమార్తాండ`(Rangamarthanda) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకి చిరంజీవి నెరేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుండటంతో అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. వీరిద్దరి మధ్య మ్యారేజ్ లైఫ్‌లో గ్యాప్ వచ్చిందని, రమ్యకృష్ణ చెన్నైలో ఉంటే, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ దూరాన్ని ఎత్తిచూపుతూ ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని, చాలా గ్యాప్ వచ్చిందంటూ పుకార్లు ఊపందుకున్నాయి.
వీటిపై కృష్ణవంశీ స్పందించారు. `రంగమార్తాండ` ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. రమ్యకృష్ణ, తాను వేర్వేరుగా ఉంటున్నట్టుగా వస్తోన్న పూకార్లను తానుపట్టించుకోనని తెలిపారు. ఇండస్ట్రీలో గాసిప్పులు కామన్ అని, అందరికి గాసిప్పులు అంటేనే ఇంట్రెస్ట్ కదా అంటూ సెటైర్లు పేల్చారు.
చాలా కాలం తర్వాత రమ్యకృష్ణతో సినిమా చేయడంపై రియాక్ట్ అవుతూ, `ఆమె రేంజ్‌ని మ్యారేజ్ చేయాలనే టెన్షన్ తనకు ఉంటుందన్నారు. రమ్యకృష్ణతో తనకు కాంపిటీషన్ ఉంటుందన్నారు. కొడుకు రిత్విక్‌తో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుందని, తానేమో హైదరాబాద్‌లో ఉంటున్నట్టు చెప్పారు. తాను ఖాళీ ఉంటే చెన్నై వెళ్తానని, వాళ్లు ఫ్రీగా ఉంటే హైదరాబాద్ వస్తుంటారని పేర్కొన్నారు కృష్ణవంశీ. కొడుకు రిత్విక్ చాలా యాక్టివ్ అని, ఎంతైనా క్రాస్ బ్రీడ్ కదా అంటూ చెప్పుకొచ్చాడు క్రియేటివ్ డైరెక్టర్.