MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఛార్మి వల్లే కొంప మునిగింది, హను మాన్ కంటే శ్రీఆంజనేయం గొప్ప చిత్రం.. కృష్ణ వంశీ రియాక్షన్ ఇదే 

ఛార్మి వల్లే కొంప మునిగింది, హను మాన్ కంటే శ్రీఆంజనేయం గొప్ప చిత్రం.. కృష్ణ వంశీ రియాక్షన్ ఇదే 

చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది మొదలైన అతిపెద్ద సంచలనం అంటే ముందుగా చెప్పుకోవాల్సింది హను మాన్ చిత్రం గురించే. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోల చిత్రాల మధ్య కనీసం పోటీని తట్టుకుంటుందా అనే స్టేజీ నుంచి ఇంత అఖండ విజయం సాధించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 12 2024, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది మొదలైన అతిపెద్ద సంచలనం అంటే ముందుగా చెప్పుకోవాల్సింది హను మాన్ చిత్రం గురించే. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోల చిత్రాల మధ్య కనీసం పోటీని తట్టుకుంటుందా అనే స్టేజీ నుంచి ఇంత అఖండ విజయం సాధించింది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల జాబితాలో తప్పకుండా హను మాన్ టాప్ 5 లో ఉంటుందని అంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రశాంత్ నీల్, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన హను మాన్ చిత్రం కంటెంట్ కి ఉన్న దమ్ము ఏంటో చూపించింది. ప్రశాంత్ వర్మ ప్రతిభ.. తేజ సజ్జా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఈ చిత్రంలో ప్రశాంత్ వర్మ ఎక్కడ ఎలాంటి సీన్ అవసరం సరిగ్గా అదే చేశారు. ఆంజనేయ స్వామికి సంబంధించిన సన్నివేశాల్లో గూస్ బంప్స్ తెప్పించారు. 

37

నార్త్ ఆడియన్స్ అయితే ఈ చిత్రం పట్ల పిచ్చి అభిమానం ప్రదర్శించారు. అంతటి గొప్ప విజయం సాధించిన హను మాన్ చిత్రంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది. గతంలో ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం చిత్రం బ్యాక్ డ్రాప్ హను మాన్ చిత్రానికి కాస్త దగ్గరగా ఉంటుంది. 

47

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్క ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ మంచి కథ అనే ప్రశంసలు దక్కాయి. ఆంజనేయ స్వామిని చూపించడానికి కృష్ణ వంశి ఉపయోగించిన గ్రాఫిక్స్ అప్పట్లోనే ఒక సంచలనం. కానీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ వల్ల ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. 

57

అయితే తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయమే గొప్ప చిత్రం అని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ ఆంజనేయం గొప్ప చిత్రం కానీ అది ఆడియన్స్ కి ఎందుకు కనెక్ట్ కాలేదో అర్థం కావడం లేదు అంటూ ఓ నెటిజన్ ప్రేక్షకులని తిడుతూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై డైరెక్టర్ కృష్ణ వంశీ హుందాగా స్పందించారు. దయచేసి ప్రేక్షకులని తిట్టకండి. వాళ్ళ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. వాళ్లకి రీచ్ కావడంలో ఎక్కడో మిస్టేక్ జరిగింది. కొన్ని అంశాలు ఆడియన్స్ కి నచ్చలేదు. ఏది ఏమైనా మీ రెస్పాన్స్ కి కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ పోస్ట్ చేశారు. 

67

మరో నెటిజన్ ఛార్మి క్యారెక్టర్ చిరాకు పుట్టించేలా దారుణంగా ఉంటుంది. అందుకే శ్రీఆంజనేయం చిత్రం ఫ్లాప్ అయింది అంటూ కామెంట్ చేశారు. కృష్ణ వంశి సింపుల్ గా గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. శ్రీ ఆంజనేయం చిత్రం నిరాశపరచడానికి ప్రధాన కారణంగా చాలా మంది ఛార్మి పాత్ర గురించి చెబుతుంటారు. 

77

ఈ చిత్రంలో ఆమె చేసే గోల దారుణంగా ఉంటుంది. అదే సమయంలో ఎక్స్ ఫోజింగ్ కూడా శృతి మించింది. అలాగే నితిన్ పాత్రని మరీ అమాయకంగా చూపించడం కూడా సెట్ కాలేదని కొందరు అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved