Acharya: ఆచార్యలో ఆ సాంగ్ అవసరమా.. కొరటాల శివ వివరణ ఇదే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యుఎస్ లాంటి ప్రాంతాల నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైంది. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ క్రమంగా వస్తోంది.

Acharya
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యుఎస్ లాంటి ప్రాంతాల నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైంది. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ క్రమంగా వస్తోంది. రాంచరణ్, చిరంజీవి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తూ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆచార్య చిత్రంలో చిరంజీవికి.. యంగ్ బ్యూటీ రెజీనాతో స్పెషల్ సాంగ్ ఉంది. శానా కష్టం అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ లిరికల్ వీడియో బాగా హిట్ అయింది. అయితే ఈ సాంగ్ పై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆచార్య చిత్రంలో చిరంజీవి కామ్రేడ్ గా నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నారు.
ఇలాంటి మంచి భావజాలం ఉన్న చిరంజీవి పాత్రతో ఐటెం సాంగ్ చేయించడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఈ చిత్రంలో అమ్మవారు, ధర్మస్థలి లాంటి బ్యాక్ డ్రాప్ ఉంది. దీనిపై కొరటాల శివ తాజాగా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
Acharya
చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ఆయన సినిమా అనగానే ప్రేక్షకులు సాంగ్స్, డ్యాన్సులు కావాలని కోరుకుంటారు. వారి ;అభిరుచికి తగ్గట్లుగా.. కథకు ఇబ్బంది కలగకుండా ఐటెం సాంగ్ ని క్రియేట్ చేసినట్లు కొరటాల తెలిపారు.
తన తోటి కామ్రేడ్ ఇంట్లో శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఈ ఐటెం సాంగ్ వస్తుంది. అది సంతోషంగా ఉండే సందర్భం కాబట్టి స్పెషల్ సాంగ్ పెట్టాం అని కొరటాల అన్నారు. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరూ ఈ చిత్రంలో కామ్రేడ్ సోదరులుగా నటిస్తున్నారు.
రాంచరణ్ తన తండ్రితో కలిసి పూర్తి స్థాయిలో నటిస్తున్న మూవీ ఇది. దీనితో సహజంగానే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలని ఆచార్య చిత్రం అందుకుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.