- Home
- Entertainment
- `దూకుడు` టైమ్‌లో శ్రీనువైట్లతో గొడవ.. నేనే అన్నీ అన్నాడు.. అసలు విషయం బయటపెట్టిన రైటర్ కోనవెంకట్..
`దూకుడు` టైమ్‌లో శ్రీనువైట్లతో గొడవ.. నేనే అన్నీ అన్నాడు.. అసలు విషయం బయటపెట్టిన రైటర్ కోనవెంకట్..
శ్రీనువైట్ల, కోన వెంకట్ కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. కానీ `దూకుడు` తర్వాత విడిపోయారు. ఆ సమయంలో ఏం జరిగింది? గొడవకి కారణమేంటో చెప్పాడు రైటర్ కోనవెంకట్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రైటర్, నిర్మాత కోన వెంకట్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. సూపర్ హిట్లు ఇచ్చారు. శ్రీనువైట్ల వంటి చాలా మంది దర్శకులతో పనిచేశారు. కానీ శ్రీనువైట్లతోనే ఎక్కువగా సినిమాలు చేశారు. వైట్ల, కోనవెంకట్, గోపీమోహన్ కాంబినేషన్‌లో సినిమా అంటే బ్లాక్ బస్టర్ అనే పేరుతెచ్చుకున్నారు. కానీ చివర్లో మాత్రం వీరి కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలేదు. కొన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో ఆ తర్వాత వీరు సక్సెస్ కాలేదు. దీనికితోడు వీరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థాలు, గొడవలు వారిని దూరం చేశాయి. ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా సినిమాలు చేస్తున్నారు.
కోన వెంకట్ ప్రస్తుతం స్క్రిప్ట్ రైటర్‌తోపాటు నిర్మాతగా మారి బిజీగా ఉంటున్నారు. మిడిల్ రేంజ్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలు సెట్ కావడంలో తెరవెనుక కథ నడిపిస్తున్నారు. అయితే ఆయన పనిచేసిన రీసెంట్ మూవీస్ `జిన్నా`, `నిశ్శబ్దం` వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. ప్రస్తుతం కొత్త సినిమాలను సెట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోన వెంకట్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్(అంజి టాక్స్) తో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. మహేష్‌బాబు నటించిన `దూకుడు` సమయంలో జరిగిన గొడవని, శ్రీను వైట్లతో గ్యాప్ రావడానికి కారణాలను ఆయన వెల్లడించారు.
ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, శ్రీనువైట్లతో గొడవ గురించి ఓపెన్ అయ్యారు. మహేష్‌బాబుతో `దూకుడు` సినిమా చేసిన విషయం తెలిసిందే. దీనికి శ్రీను వైట్లతోపాటు కోనవెంకట్, గోపీమోహన్ కూడా వర్క్ చేశారు. కానీ తమకు క్రెడిట్ ఇవ్వలేదట. తానే అన్నీ చేశానని హీరో, నిర్మాతల మందు శ్రీనువైట్ల చెప్పుకున్నాడట. దీంతో తమకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో వీళ్లు బయటకు వచ్చినట్టు చెప్పారు. `దూకుడు` చివరి దశకు వచ్చేటప్పటికీ శ్రీనువైట్లలో మరో వ్యక్తి బయటకు వచ్చాడని, అంతా నేనే అని చెప్పడంతో నిర్మాతలు గానీ, హీరో గానీ మరి వాళ్లేందుకు అన్నారట. అలా తమకు క్రెడిట్ ఇవ్వలేదన్నారు. అయితే అలా అన్న వ్యక్తి ఎవరో కూడా తమకు తెలుసన్నాడు కోన వెంకట్.
`ఆగడు` కథని మహేష్‌కి `దూకుడు` సమయంలోనే చెప్పి ఒప్పించారట. కానీ తీరా సినిమా తీయాల్సి వచ్చినప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్టయ్యిందని అప్పుడు అసలు విషయం బయటపడిందన్నారు. ఆ సినిమా రిజల్ట్, ఆ తర్వాత పరిణామాలు తెలిసిపోయాయని, అన్నీ నేనే అనుకుంటే ఏమైందో తెలిసిందిగా అని తెలిపారు. ఆ తర్వాత శ్రీను వైట్లకి అన్నీ ఫ్లాపులే పడ్డాయి. దానిపైనే పరోక్షంగా సెటైర్లు వేశాడు కోన వెంకట్. ఇప్పుడు అది కామెడీగా అనిపిస్తుందన్నారు. అలా తాము పక్కకు వెళ్లామని తెలిపారు.
తాము వెళ్లాక..అనిల్ రావిపూడి వచ్చినట్టు చెప్పాడు. ఆయన కూడా వర్క్ చేశాడని, కానీ చేయగలిగింది చేశాడు. అందులో ఆయన తప్పేం లేదన్నారు. అనిల్‌తో మంచి పరిచయం ఉందని, `కందిరీగ`కి కలిసి పనిచేశామని తెలిపారు. ప్రతి సిట్టింగ్‌కి గోపీచంద్ మలినేని, అనిల్, తాను వెళ్లేవాళ్లమని తెలిపారు కోన. శ్రీను వైట్ల నుంచి బయటకు వచ్చాక వివి వినాయక్, గోపీచంద్ మలినేని, శ్రీవాస్, బాబీ వంటి వారితో కలిసి వర్క్ చేశారు. పలు విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు. ఇదిలా ఉంటే మళ్లీ శ్రీను వైట్ల, కోన, గోపీమోహన్ కలిసి చాలా కాలం తర్వాత `బ్రూస్‌లీ`కి వర్క్ చేశారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వా ఆ గ్యాప్ పెరిగిపోయింది.