హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తున్న కిరణ్ అబ్బవరం.. అడ్డంగా దొరికిపోయిన వైనం..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్త నెట్టింట రచ్చ చేస్తుంది. టీవీ షోలో దొరికిపోవడమే అందుకు కారణం.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. కెరీర్ ఒక్క హిట్టు, రెండు ఫ్లాపులు అన్న చందంగా సాగుతుంది. `వినరో భాగ్యము విష్ణు కథ` హిట్ అయితే `మీటర్`, ఇటీవల వచ్చిన `రూల్స్ రంజన్` ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరంకి సంబంధించిన ఓ ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ప్రేమలో పడ్డాడట. అయితే హీరోయిన్‌తో ప్రేమలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
కిరణ్ అబ్బవరం తాజాగా ఓ టీవీ షోకి వెళ్లాడు. `దావత్` పేరుతో రన్ అవుతున్న టాక్ షో ఇది. బిగ్ బాస్ బ్యూటీ, హాట్ సెన్సేషన్ ఆషురెడ్డి దీన్ని హోస్ట్ చేస్తుంది. ఈ షోకి వచ్చిన కిరణ్ అబ్బవరం.. అనుకోకుండా ప్రేమ విషయంలో దొరికిపోయాడు. ఈ షోలో మొత్తం బయట అనుకుంటున్నారనే దానిమీదనే నడుస్తుందని ముందే చెప్పింది యాంకర్ ఆషురెడ్డి. అన్నట్టుగానే ప్రేమ విషయాన్ని అడిగింది. రహస్య గోరక్(Rahasya Gorak)తో రిలేషన్ షిప్‌లో ఉన్నారు అని ఆషు రెడ్డి అడిగింది.
`లేదండి, అదేం లేదు. ఏదన్నా ఉంటే చెప్తాం` అని కిరణ్ అబ్బవరం అన్నాడు. దీంతో పాయింట్ పట్టేసింది ఆషు రెడ్డి. చెప్తాం అంటున్నారంటే ఇద్దరు కలిసి ఒకేసారి అనౌన్స్ చేస్తారా? డేట్ అని ఆషురెడ్డి అడిగింది. దీంతో నాలుక కర్చుకోవడం కిరణ్ అబ్బవరం వంతు అయ్యింది. సిగ్గుపడుతుండగా, ఏ అంటూ ఆషురెడ్డి మరింతగా రెచ్చగొట్టింది. దీంతో ఇంటర్వ్యూలలో ఎప్పుడూ ఇలా దొరికిపోలేదు నేను అంటూ కిరణ్ సిగ్గులతో ముగ్గేశాడు. దీంతో అసలు కథ బయటపడినట్టయ్యింది.
దీంతో నెట్టింట రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. కిరణ్ మామూలోడు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. రహస్య గోరక్ తో కలిసి `రాజావారు రాణిగారు` చిత్రంలో నటించాడు కిరణ్. ఆయనకిది తొలి చిత్రం. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. క్రిటిక్స్ ప్రశంసలందుకుంది. ఈ సినిమా కిరణ్ లైఫ్‌ని మార్చేసింది. ఆ తర్వాత `ఎస్‌ఆర్ కళ్యాణమండపం` చిత్రంలో విజయాన్ని అందుకున్నాడు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం హీరో అనే ముద్ర వేసుకున్నారు.
అయితే మొదటి సినిమా సమయంలోనే రహస్య గోరక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. ఇన్నాళ్లుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని తాజా ఆయన కామెంట్లని బట్టి తెలుస్తుంది. దాదాపు నాలుగేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారట. మొత్తానికి ఇప్పుడు టీవీ షోలో అడ్డంగా దొరికిపోయాడు. ఆ మధ్య ఇటు కిరణ్ అబ్బవరం, అటు రహస్య గోరక్ సైతం ఓ వెకేషన్ ఫోటోలను పంచుకున్నారు. ఇద్దరూ వేర్వేరుగా ఒకే చోట దిగిన పిక్స్ ని షేర్ చేశారు. దీంతో అప్పుడే వీరి బండారం బయటపడింది. కానీ ఇప్పుడు దానికి బలాన్ని చేకూర్చారు కిరణ్. దీంతో కిరణ్ అబ్బవరం రహస్య ప్రేమాయాణం బట్టబయలైందంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.
కిరణ్ అబ్బవరం `రాజావారు రాణిగారు`, `ఎస్‌ఆర్ కళ్యాణమండపం` చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన `సెబాస్టియన్`, `సమ్మతమే`, `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` చిత్రాలు పరాజయం చెందాయి. `వినదో భాగ్యము విష్ణుకథ` హిట్ కాగా, `మీటర్`, `రూల్స్ రంజన్`తో మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌లు చవిచూశాడు. అయితే ఇప్పుడు కొంత గ్యాప్‌తో నెమ్మదిగా సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఆచితూచి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి చిత్రీకరణ దశలో ఉంది.