రతిక లాంటి అమ్మాయి భార్యగా రావాలి నీకు.. నా మీద అంత పగ ఎందుకు, నెటిజన్ కామెంట్స్ కిరణ్ అబ్బవరం రిప్లై
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ వల్లే ఈ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతోంది.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ వల్లే ఈ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతోంది. అక్టోబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
సమ్మోహనుడా సాంగ్ ఎఫెక్ట్ తో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఇక ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పిస్తే చాలు మంచి విజయం సాధిస్తుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా హీరోయిన్ నేహా శెట్టికి యువతలో ఉన్న క్రేజ్ కూడా ఈ చిత్రానికి కలసి వస్తోంది.
కిరణ్ అబ్బవరం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాపై బజ్ పెంచుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఆన్లైన్ లో అభిమానులతో ముచ్చటించారు. వారడిగిన ప్రశ్నలకు కిరణ్ అబ్బవరం సమాధానాలు ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న.. దానికి కిరణ్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారాయి.
సదరు నెటిజన్ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిన ఫైర్ బ్రాండ్ రతికతో ముడిపెడుతూ ఒక ప్రశ్న సంధించాడు. కిరణ్ అన్నా రూల్స్ రంజన్ చిత్రం విజయం సాధించాక నీకు రతిక లాంటి అమ్మాయి భార్యగా రావాలి అంటూ కామెంట్ చేశాడు. దీనికి కిరణ్ అబ్బవరం బదులిస్తూ తమ్ముడూ నా మీద అంత పగ ఎందుకు ? పెళ్ళైతే చేసుకుందాం కానీ.. చూద్దాం ఎలాంటి అమ్మాయి వస్తుందో అని బదులిచ్చాడు.
రతిక రోజ్ హౌస్ లో నిత్యం గొడవలు పెట్టుకుంటూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దీనితో ఆడియన్స్ లో ఆమెపై నెగిటివిటి ఏర్పడింది. ఫలితంగా ఆదివారం రోజు ఆమె ఎలిమినేషన్ కి గురైంది. ఇక రూల్స్ రంజన్ చిత్రం విషయానికి వస్తే కిరణ్ సబ్బవరం ఓ ఇంటర్వ్యూలో నేహా శెట్టి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సమ్మోహనుడా సాంగ్ కోసం నేహా శెట్టితో రొమాన్స్ చేసే సమయంలో తాను వణికిపోయినట్లు కిరణ్ అబ్బవరం తెలిపాడు.ఆ ఆమె తన దగ్గరకి వస్తుంటే షివరింగ్ వచ్చిందని పేర్కొన్నాడు. చాలా టెన్షన్ కి గురైనట్లు కిరణ్ పేర్కొన్నాడు. ఇలాంటి రొమాంటిక్ సన్నివేశం తనకు చాలా కొత్త అని కిరణ్ అభిప్రాయ పడ్డాడు. ఇక మరో నెటిజన్ కిరణ్ అబ్బవరంని హీరోలా ఉన్నావ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. కిరణ్ బదులిస్తూ.. హీరోలా ఉండక్కర్లేదు కానీ మీలో ఒకడిగా ఉంటే చాలు అని బదులిచ్చాడు.