- Home
- Entertainment
- షేకింగ్ శేషు భార్యను వచ్చి ఆఫీస్ బాయ్ గా చేయమను ఇక కూతురు... దారుణమైన కామెంట్స్ తో రెచ్చిపోయిన కిరాక్ ఆర్పీ!
షేకింగ్ శేషు భార్యను వచ్చి ఆఫీస్ బాయ్ గా చేయమను ఇక కూతురు... దారుణమైన కామెంట్స్ తో రెచ్చిపోయిన కిరాక్ ఆర్పీ!
మల్లెమాల సంస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీని నటుడు షేకింగ్ శేషు విమర్శించిన విషయం తెలిసిందే. అన్నం పెట్టిన సంస్థను విమర్శిస్తే తల్లిని విమర్శించినట్లే. అక్కడ ఫుడ్ నచ్చకపోతే కిరాక్ ఆర్పీ స్టార్ హోటల్ నుండి తెప్పించుకోవాల్సింది. అతడు ఓ సినిమా మొదలుపెట్టి రూ. 20 లక్షలకు నిర్మాతను ముంచేశాడని విమర్శలు గుప్పించాడు.

Kirak RP
షేకింగ్ శేషు తనపై చేసిన ఆరోపణలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. శేషు కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసి దారుణమైన పదజాలంతో అతనిపై మండిపడ్డాడు. షేకింగ్ శేషుపై కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.
Kirak RP
ఇక కిరాక్ ఆర్పీ ఏమన్నాడంటే... కథ నచ్చడంతో అరుణాచలం గారు మూవీ నిర్మిస్తాను అన్నారు. నాగబాబు గారు, చక్రవర్తి గారు నన్ను ఆశీర్వదించారు. సినిమా చేయడానికి ప్రోత్సహించారు. అనుకోకుండా సినిమా మధ్యలో ఆగిపోయింది. సినిమా ఓకె అయ్యాకే నేను ఆఫీస్ తీసుకున్నాను.
Kirak RP
ఆఫీస్ లేకుండా ఎక్కడ కూర్చుని పని చేయాలి? లేదంటే షేకింగ్ శేషు ఇల్లు ఇవ్వమని చెప్పండి. ఆయన భార్యను ఆఫీస్ బాయ్ గా చేయమనండి. వాళ్ళ అమ్మాయిని పాల పాకెట్స్ తెమ్మనండి తప్పేముంది. నేను ఆఫీస్ ఓపెన్ చేసి నిర్మాతకు ఖర్చు పెంచాను అని చెప్పడానికి ఆయన ఎవరు?
Kirak RP
షేకింగ్ శేషు తనపై చేసిన ఆరోపణలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. శేషు కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసి దారుణమైన పదజాలంతో అతనిపై మండిపడ్డాడు. షేకింగ్ శేషుపై కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.
Kirak RP
నేను జబర్దస్త్ లో స్కిట్స్ చేసే నాటికి ఆయన అక్కడ లేడు. షేకింగ్ శేషును నేను జస్ట్ రెండు మూడు సార్లు మాత్రమే కలిశాను. పెద్దగా పరిచయం కూడా లేదు. అలాంటిది ఆయన ఎవరు నన్ను విమర్శించడానికి. నేను ఓ వ్యవస్థ గురించి మాట్లాడాను. ఈ షేకింగ్ శేషు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తొత్తు. అందుకే అలా మాట్లాడుతున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
Kirak RP
షేకింగ్ శేషు భార్య, పిల్లలను కూడా తెరపైకి తెస్తూ కిరాక్ ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఇండస్ట్రీ పెద్దను ఎదిరించడం వెనుక ఎవరున్నారనే మొదలైంది. నాగబాబు ప్రోద్బలంతోనే కిరాక్ ఆర్పీ ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.