- Home
- Entertainment
- కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం పై కుట్ర... సంచలన విషయాలు వెల్లడించిన జబర్దస్త్ మాజీ కమెడియన్
కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం పై కుట్ర... సంచలన విషయాలు వెల్లడించిన జబర్దస్త్ మాజీ కమెడియన్
మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది. అయితే తన సక్సెస్ చూడలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ... ఆయన మండిపడ్డారు.

Kiraak RP
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ పై కొందరు కక్ష కట్టారట. తన సక్సెస్ చూసి ఓర్వలేని ఓ బ్యాచ్ వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారట. ఈ మేరకు కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేశారు. నా షాప్ లో చేపల పులుసు రుచిగా లేదంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పెయిడ్ బ్యాచ్ పని.
Kiraak RP
నేను అనేక రకాల చేపల పులుసు అందుబాటులోకి తెచ్చాను. ఒకసారి తిన్న వాళ్ళు బాగుందని పది మందికి చెబుతున్నారు. నా కిచెన్ ఎలా ఉంటుందో, అక్కడ చేపల పులుసు ఎంత శుభ్రంగా, క్వాలిటీగా తయారు చేస్తారో నేను చూపించాను. చేపల పులుసు రుచిగా లేకపోతే ఎవరూ కొనరు. నెగిటివ్ ప్రచారం చేసి నా వ్యాపారం కూలదోయాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు.
Kiraak RP
వారు ఎంతగా తప్పుడు ప్రచారం చేస్తే నాకు అంత మంచింది. ఆ విధంగా నా వ్యాపారానికి ఎక్కువ పబ్లిసిటీ దక్కుతుందని, కిరాక్ ఆర్పీ వెల్లడించారు. మాజీ జబర్దస్త్ కమెడియన్ అయిన కిరాక్ ఆర్పీ కొన్ని నెలల క్రితం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేశారు. అది ఊహించని సక్సెస్ అయ్యింది. లక్షల్లో సంపాదించే స్థాయికి కిరాక్ ఆర్పీ వెళ్ళాడు.
Kirak RP
డిమాండ్ పెరగడంతో సంక్రాంతికి ముందు షాప్ మూసేసి ఎక్కువ సిబ్బందిని నియమించుకున్నాడు. అది కూడా నెల్లూరు వచ్చి స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నాడు. నెక్స్ట్ మణికొండలో ఒక బ్రాండ్ స్టార్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. కిరాక్ ఆర్పీ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుందని సమాచారం. నాకు లక్షల్లో లాభం వస్తుందని కిరాక్ ఆర్పీ స్వయంగా వెల్లడించారు.
Kirak RP
అలాగే పంచ్ ప్రసాద్ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య సమస్యలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. ప్రసాద్ మంచి వాడు. ఎంత ఖర్చైనా అతన్ని నేను ఆదుకుంటానని తాజా ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. కిరాక ఆర్పీ మాట్లాడుతూ... పంచ్ ప్రసాద్ మంచి వ్యక్తి. నాకు మిత్రుడు. అతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి ఉన్న డబ్బులు మొత్తం ఖర్చై పోయాయి.
Kiraak RP
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ వద్ద కనీసం ఒక్క రూపాయి లేదు.ఇంటి అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పంచ్ ప్రసాద్ కి నేను సహాయం చేస్తాను. రూ. 15 లక్షలు ఖర్చైనా ప్రసాద్ కి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తాను. త్వరలో మణికొండ ఏరియాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాండ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ షాప్ ద్వారా వచ్చే లాభాల నుండి ప్రతి నెలా కొంత డబ్బులు పంచ్ ప్రసాద్ కి ఇస్తాను. అతని ఖర్చులు పోగా ఒక పదివేలు అదనంగానే ఇస్తాను... అని కిరాక్ ఆర్పీ తన గొప్ప మనసు చాటుకున్నాడు.