- Home
- Entertainment
- నా బిజినెస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు, ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చిన కిరాక్ ఆర్పీ..
నా బిజినెస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు, ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చిన కిరాక్ ఆర్పీ..
కొంత మంది కావాలనే తనను తన బిజినెస్ ను పాడు చేయాలని చూస్తున్నారంటున్నాడు జబర్థస్త్ మాజీ కమెడియన్.. నెల్లూరు చేపల పులుసు తో బిజినెస్ మెన్ గా ఎదిగిన కిర్రాక్ ఆర్పీ. ఆయన ఏమంటున్నాడంటే..?

Kiraak RP
జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ డమ్ సంపాదించాడు ఆర్పి. కిర్రాక్ ఆర్పీగా పేరు తెచ్చుకుని.. టీమ్ లీడర్ గా కూడా మంచి మంచి స్కిట్ లు చేశాడు. ఆయన ఏం స్కిట్ చేసినా.. నెల్లురు యస.. నెల్లురు పదం, వెంకటేశ్వరావు.. ఈ మూడు ఉండేట్టు చూసుకునేవాడు. జబర్థస్తు నుంచి బయటకు వచ్చి.. ఆ షోపై.. నిర్వాహకులపై ఘాటు విమర్షలు చేశాడు ఆర్పీ..
Kiraak RP
కామెడీ షో నుంచి బయటకు వచ్చి..వెండితెరపై వెలగాలి అనుకున్నాడు కీరాక్ ఆర్పీ. దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుని..దెబ్బతిన్నాడు. ఇక లాభం లేదు అని.. బిజినెస్ వైపు వచ్చాడు ఆర్పీ. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లు స్టార్ట్ చేశాడు. బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి.. దూసుకుపోతున్నాడు ఆర్పీ. ఈ విషయంలో మంచి సక్సెస్ ను వెనకేసుకుకోవడంతో పాటు మంచి లాభాలు కూడా వెనకేసుకుంటున్నాడు ఆర్పీ.
Kiraak RP
ఇక ఆర్పీ ఒక్క బ్రాంచ్ తో ఆపకుండా.. ఈ చేపల పులుసు పేరు మీద.. ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాడు ఆర్పి. హైదరాబాద్ లోనే కూకట్ పల్లి, మాదాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో ఆర్పీ చేపల పులుసు ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. అనంతపూర్, బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొ ఫ్రాంచైజీస్ ఇచ్చిన ఆర్పీ.. భారీగా లాభాలు సాధిస్తున్నాడు.
ఇక తాజాగా.. ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బిజినెస్ ను కొంత మంది నాశనం చేయాలని చూస్తున్నారని. తన చేపల పులుసు గురించి నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారని తన స్టైల్ లో వారికి వార్నింగ్ ఇచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే పెయిడ్ బ్యాచ్ లుగా తయారై తన రెస్టారెంట్ బిజినెస్ పై దెబ్బ తీయాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Kirak RP
చేపల పులుసు చూట్టానికే బాగుందని.. రుచి మాత్రం బాగోలేదన్న దుష్ప్రచారం చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నెగెటివిటీ ప్రచారం జరుగుతుందని అన్నారు. ఇక నా చేపల పులుసు టేస్ట్ కనక బాగా లేకపోతే ఎవరు కొనడానికి రారు.నేను ఈ చేపల పులుసు కోసం ఉపయోగించే చేపలన్నీ కూడా నెల్లూరు నుంచి తెప్పించినవేనని ఈయన తెలిపారు.
Kirak RP
ఇక తన చేపల పలుసు గురించి.. ఆర్పీ మాట్లాడుతూ.. నా చేపల పులుసుకు బోలెడంత డిమాండ్ ఉంది. కొన్నిసార్లు అయితే.. ఉన్న డిమాండ్ కు తగ్గట్టు సప్లూ కూడా చేయలేకపోతున్నాను.. అంత డిమాండ్ ఉంది నా చేపల పులుసుకు అన్నారు. సామాన్యులే కాదు.. ఎంతోమంది స్టార్స్ కూడా చేపల పులుసు తీసుకెళ్లడానికి పోటీ పడుతున్నాుు అని అన్నారు ఆర్పీ.
ఇంత మంది వచ్చి కొని తింటున్నారంటే అది బాగుండబట్టే కదా.. బాలేపోతే ఇంత మంది ఇన్ని సార్లు ఎలావస్తారు అంటూ ఆర్పీ తన ఆవేదన వ్యక్తం చేశారు. చేపల పులుసు టేస్ట్ బాగున్నా కాని.. పనిగట్టుకొని చేపల పులుసు పై దుష్ప్రచారం చేస్తున్నారని.. అలా చేసినా కూడా నాకు ఎలాంటి నష్టం లేదని ఆయన అన్నారు. నేను క్వాలిటీగా కూరు సప్లే చేసేవరకూ.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.