- Home
- Entertainment
- బిగ్‌బాస్ సీజన్ 6 కు రెమ్యునరేషన్ పెంచేసిన నాగార్జున, ఎపిసోడ్ కు ఎంత వసూలు చేస్తున్నాడంటే..?
బిగ్‌బాస్ సీజన్ 6 కు రెమ్యునరేషన్ పెంచేసిన నాగార్జున, ఎపిసోడ్ కు ఎంత వసూలు చేస్తున్నాడంటే..?
కింగ్ నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా తీసుకోబోతున్నారు. కాని అది సినిమాలకు కాదు.. రియాల్టీ షో కోసం. అవును తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీషో నెక్ట్స్ సీజన్ కోసం భారీగా వసూలు చేయబోతున్నాడట... ఇంతకీ కింగ్ రేటు ఎంత..?

స్మాల్ స్క్రీన్ పై అన్ని భాషల్లో .. బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్.. తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో త్వరలోనే సీజన్-6 స్టార్ట్ కాబోతోంది. ఈ సీజన్ లో కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జున సందడి చేయబోతున్నారు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కు సంబంధించిన ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ రియాల్టీ షో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కరకాల పేర్లు వినిపిస్తు్ననాయి. ఇక హోస్ట్ గా వరుసగా నాలుగో సారి నాగార్జున లీడ్ చేయబోతున్నాడు.
వరుసగా మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడించిన నాగార్జున.. రీసెంట్ గా బిగ్ బాస్ ఓటీటీ ని కూడా విజయవంతం చేశారు. దాంతో బాలీవుడ్ లో సల్మాన్ లాగా.. తెలుగు బిగ్ బాస్ కు నాగ్ బ్రాండ్ అయిపోయారు. ఇది దృష్టిలో పెట్టుకుని నాగార్జున ఈసీజన్ కు రెమ్యూనరేషన్ రేటు పెంచేసినట్టు తెలుస్తోంది.
బిగ్‌బాస్ సీజన్-6కి నాగార్జున తీసుకునే రెమ్యుననరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతోంది. గత సీజన్ కోసం ఒక్క ఎపిసోడ్‌కు 12 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. షో మొత్తానికి కలిపి 12 కోట్లు తీసుకున్నాడని, ఇప్పుడు సీజన్-6 కోసం నాగార్జున ఏకంగా 15 కోట్ల వరకూ వసూలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పుటికే బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వారెవరు అనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, ఆర్జే సూర్య, యాంకర్ ఉదయభాను, అమర్‌దీప్, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్ లాంటి బుల్లితెర సెలబ్రెటీలు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.