- Home
- Entertainment
- పాన్ ఇండియా హీరోయిన్ తో అన్నీ అట్టర్ ఫ్లాప్ చిత్రాలే, అయినా ఆమెనే రిపీట్ చేసిన తెలుగు హీరో.. ఎందుకు ?
పాన్ ఇండియా హీరోయిన్ తో అన్నీ అట్టర్ ఫ్లాప్ చిత్రాలే, అయినా ఆమెనే రిపీట్ చేసిన తెలుగు హీరో.. ఎందుకు ?
హీరోయిన్ తో సక్సెస్ వస్తే మరో మూవీలో ఛాన్స్ ఇస్తుంటారు. కానీ వరుసగా ఫ్లాప్ చిత్రాలు పడ్డప్పటికీ ఆమెనే హీరోయిన్ గా రిపీట్ చేసే హీరో ఒకరు ఉన్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nagarjuna Akkineni
టాలీవుడ్ లో దర్శకులకు, నిర్మాతలకు, హీరోయిన్లకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంట్ ప్రకారం హీరోయిన్లని కూడా ఎంచుకుంటుంటారు. హీరోయిన్ తో సక్సెస్ వస్తే మరో మూవీలో ఛాన్స్ ఇస్తుంటారు. కానీ వరుసగా ఫ్లాప్ చిత్రాలు పడ్డప్పటికీ ఆమెనే హీరోయిన్ గా రిపీట్ చేసే హీరో ఒకరు ఉన్నారు.
Nagarjuna Akkineni
ఆ హీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున. నాగార్జున ఇటీవల కాలంలో ఎక్కువగా రిపీట్ చేసిన హీరోయిన్ అనుష్క శెట్టి. అనుష్క పాన్ ఇండియా హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. యువతలో అనుష్కకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్, నటన విషయంలో ఆడియన్స్ అనుష్కకి ఫిదా అవుతుంటారు.
నాగార్జున సూపర్ చిత్రంతో అనుష్క హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ఆమెని ఎంపిక చేసి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అనుష్క టాలీవుడ్ లో వెనుదిగిరి చూసుకోలేదు. తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ మూవీలో అనుష్క ఒక రేంజ్ లో గ్లామర్ ప్రదర్శించింది. నాగార్జునతో కెమిస్ట్రీ పండించింది. సూపర్ చిత్రం అంత గొప్ప విజయం సాధించలేదు. జస్ట్ యావరేజ్ గా నిలిచింది.
Nagarjuna Akkineni
కానీ నాగార్జున ఆమెనే హీరోయిన్ గా రిపీట్ చేస్తూ వచ్చారు. సూపర్ తర్వాత నాగార్జున డాన్ చిత్రంలో అనుష్క నటించింది. లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. రగడ చిత్రంలో నాగ్.. అనుష్కని మరోసారి రిపీట్ చేశారు. ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. వరుసగా ఫ్లాపులు పడుతున్నా నాగార్జున పట్టించుకోలేదు.
Anushka Shetty
రగడ తర్వాత ఢమరుకం చిత్రంలో కూడా నాగార్జున అనుష్కకే ఛాన్స్ ఇచ్చారు. ఆ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. ఇంతటితో అయిపోలేదు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, కేడి లాంటి చిత్రాల్లో అనుష్క కామియో రోల్స్ లో నటించింది. కామియో రోల్స్ చేసిన చిత్రాలు పక్కన పెడితే నాగార్జున, అనుష్క కాంబినేషన్ లో ఒక్క సాలిడ్ హిట్ చిత్రం కూడా లేదు.