- Home
- Entertainment
- Rajamouli with Yash: జక్కన్నతో `కేజీఎఫ్2` స్టార్ సినిమా.. నిజమైతే RRR, బాహుబలి రికార్డులు బద్దలే
Rajamouli with Yash: జక్కన్నతో `కేజీఎఫ్2` స్టార్ సినిమా.. నిజమైతే RRR, బాహుబలి రికార్డులు బద్దలే
`ఆర్‌ఆర్‌ఆర్`తో మరో సంచలనానికి తెరలేపారు రాజమౌళి. `కేజీఎఫ్ 2`తో మరో సంచలనానికి తెరలేపబోతున్నారు రాకింగ్ స్టార్ యష్. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది సంచలనాలకు అడ్డాగా మారబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కన్నడ స్టార్ యష్ `కేజీఎఫ్` సినిమాతో కన్నడ సినిమా స్టామినా ఏంటో ఇండియన్ సినిమాకి రుచి చూపించారు. ఇప్పుడు `కేజీఎఫ్ 2`తో ఆయన మరో సంచలనానికి తెరలేపబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం యష్ రేంజ్ మరింతగా పెరిగిపోతుందని, పాన్ ఇండియా స్టార్‌లో ఒకరిగా నిలిచిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మరోవైపు ఈ సినిమాతో యష్ ఒక ఊరమాస్, యాక్షన్, స్టయిలీష్‌గా హీరోగా అవతరించారు యష్. ఈ రేంజ్ మాస్ ఇమేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో అతిశయోక్తిలేదు. `కేజీఎఫ్` పూర్తి ఊర మాస్ ఫిల్మ్. అదే ఇమేజ్ యష్‌కి వచ్చింది. ఇప్పుడొస్తున్న సెకండ్ పార్ట్ తో ఆ ఇమేజ్ మరింతగా పెరుగుతుంది. నేషనల్ స్టార్‌గా ఆయన అవతరిస్తారని చెప్పొచ్చు.
ఇలాంటి స్టయిలీష్, మాస్ హీరోతో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి సినిమా చేస్తే అది ఊహకందని విధంగా ఉంటుందని చెప్పొచ్చు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే రాజమౌళి, మరో సెన్సేషన్ స్టార్ యష్‌తో సినిమా అంటే కచ్చితంగా అదే ఇండియన్ సినిమా తెరపై బిగ్గెస్ట్ సెన్సేషన్ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అది నిజమవుతుందా? దీనిపై యష్ స్పందించారు. రాజమౌళితో సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు.
తాజాగా `కేజీఎఫ్ 2` ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళితో సినిమా చేస్తారా? అన్న ప్రశ్నకి యష్ స్పందించారు. `రాజమౌళికి ఒక విజన్ ఉంటుంది. ఆయన విజన్‌కి నేను సూట్ అవుతానని భావిస్తే, నేను ఆయనతో పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇది పూర్తిగా రాజమౌళి నిర్ణయం. అయితే ఆయన వద్ద నాకు కావాల్సిన సరైన స్క్రిప్ట్ ఉంటే నేను సినిమా చేసేందుకు సిద్ధంగానే ఉన్నా` అని తెలిపారు యాష్.
మరి రాజమౌళి మంచి కథతో వస్తాడా? యష్‌తో సినిమా చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ చూడబోతుంటే వీరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా రాబోతుందని అనిపిస్తుంది. ఫ్యాన్స్ నుంచి సైతం ఇలాంటి వార్తే వినిపిస్తుంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం కచ్చితంగా `ఆర్‌ఆర్‌ఆర్`, `బాహుబలి` రికార్డ్ లు బ్రేక్ అవుతాయని అంటున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే మల్టీస్టారర్లపై,నార్త్ లో సినిమాలు చేయడంపై యష్ స్పందించారు. మనమేంటో ఇక్కడే నిరూపించుకోవాలని, మనం సినిమాలు తీసి పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటాలని, నార్త్ కి వెళ్లాల్సిన అవసరం మనకు లేదని చెప్పాడు. మల్టీస్టారర్ కోసం హీరోలు వస్తే సినిమా చేయనని, డైరెక్టర్ మల్టీస్టారర్ స్క్రిప్ట్ తో వస్తే, అతను హ్యాండిల్ చేయగలడనిపిస్తే చేస్తానని చెప్పాడు యష్.
`ఆర్‌ఆర్‌ఆర్`తో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్‌తో సినిమా చేయబోతున్నారు. ఇది ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీ అని, ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం. ఇది ఈ ఏడాది చివరల్లో పట్టాలెక్కించేందుకు ప్లాన్ జరుగుతుంది. దాదాపు ఎనిమిది వందలకోట్లతో ప్లాన్ చేసినట్టు సమాచారం.