- Home
- Entertainment
- ఆ హీరోయిన్ అంటే ఇష్టం, ఒక్క సినిమా అయినా చేయాలని ఉంది, కెజియఫ్ స్టార్ యష్ కామెంట్స్
ఆ హీరోయిన్ అంటే ఇష్టం, ఒక్క సినిమా అయినా చేయాలని ఉంది, కెజియఫ్ స్టార్ యష్ కామెంట్స్
కెజియఫ్2 సూపర్ హిట్ అవ్వడంతో సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఈ సందర్భంగా కొన్ని విషయాలు పంచుకున్న యంగ్ స్టార్..తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి కూడా చెప్పారు.

ప్రస్తుతం దేశమంతా కెజియఫ్ మ్యానియా నడుస్తుంది. కన్నడ నాట నుంచి ఇంతలా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ఇది ఓక్కటే కావడంతో..హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా 'కేజీఎఫ్ 2' గురించిన చర్చే నడుస్తోంది. భారీ ప్రమోషన్లు చేయకుండానే ఈ సినిమా దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే వారం రోజుల్లో దాదాపు 700 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది కెజియఫ్ పార్ట్2
కెజియఫ్ ను మించి ఛాప్టర్2 మూవీ తెరకెక్కించడంతో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరోవైపు ఈ మూవీ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్నరాకింగ్ స్టార్ వరుస ఇంటర్వ్యూలలో ఎన్నో విషేషాలు పంచుకుంటున్నాడు.
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడియ కన్నడ స్టార్ హీరో యష్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన ఫేవరెట్ హీరోయిన్ దీపిక పదుకునే అని చెప్పాడు. ఆమెతో కలిసి ఒక్క సినిమా అయినా నటించాలనేది తన కోరిక అని తెలిపాడు. దీపిక నటన ఎంతో బాగుంటుందని చెప్పాడు. ఆమె నటించే సినిమాలను చూస్తుంటానని అన్నాడు.
ఒక సాధారణ డ్రైవర్ కొడుకు స్థాయిన నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు యష్. నువ్వ హీరో ఏంటీ.. అన్న స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వరకూ యష్ ఎంతో కష్టపడి..ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు.
రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈసినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.