- Home
- Entertainment
- తెలుగు పూర్తిగా నేర్చుకున్నా.. ఇక టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అంటున్న కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
తెలుగు పూర్తిగా నేర్చుకున్నా.. ఇక టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అంటున్న కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు కెజియఫ్. ఈ సినిమాతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక ఈ మూవీతో హీరోయష్ తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి పేరు వచ్చింది. ఇక త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది శ్రీనిధి.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాతోహీరో యష్ తో పాటుహీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా అంతే పేరు వచ్చింది. మంచి హైటూ బ్యూటీతో కన్నడ ఆడియన్స్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ అందరిన ఆమె ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో దేశవ్యాప్తంగా శ్రీనిధికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడింది. కేజీఎఫ్ 2 సినిమా నా క్రేజ్ ను మరింతగా పెంచింది. ఈ సినిమా చూసినవాళ్లంతా చాలా బాగా చేశావని అంటున్నారు అని సంతోషం వ్యక్తం చేసింది.
ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను .. నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో వెయిట్ చేశాము. ఇప్పుడు ఈ సినిమా వందల కోట్లను వసూలు చేస్తుండటం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ గారికి ప్రతి అంశంపై క్లారిటీ ఉంటుంది. అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురిపించింది శ్రీనిధి.
ఇక ప్రతి రోజూ షూటింగ్ ఒక ప్లానింగ్ ప్రకారమే నడిచేది. నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడలేదు.ఇంత పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు, అది ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది..ఇక తాను అన్ని భాషల్లో సినిమాలపై దృష్టి పెట్టబోతున్నట్టు తెలిపింది శ్రీనిధి. తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నట్టు పేర్కోంది శ్రీనిధి.
అంతే కాదు ప్రస్తుతం తెలుగును మరింత స్పష్టంగా మాట్లాడం నేర్చుకుంటున్నాను. చిన్న చిన్న అవకశాలు కాకుండామంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది శ్రీనిధి. ఇప్పటికే తమిళంలో కోబ్రా సినిమా చేస్తుంది శ్రీనిధి ఈమూవీ నెక్ట్స్ మన్త్ రిలీజ్ కాబోతోంది.
విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు తమిళ సీనియర్ స్టార్ హీరో. ఇక ఈమూవీ రిలీజ్ అయిన తరువాత తెలుగు సినిమా పై దృష్టి పెడతానంటోంది శ్రీనిధి. తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తాను" అని చెప్పుకొచ్చింది కన్నడ బ్యూటీ. ప్రస్తుతం కెజియఫ్ సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్ లో ఉంది శ్రీనిధి.