KGF 2:ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ !
350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైంది. 2018లో వచ్చిన కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా ఛాప్టర్ 2 వచ్చిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. కలెక్షన్స్ వైజ్ గా అదిరిపోయే ఓపినింగ్స్ తో తొలి రోజు దుమ్ము దులిపేసింది. ప్రీమియర్ షోలతో థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. . రిలీజ్ ముందు దాకా సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు KGF Chapter 2పై ఎక్సపెక్టేషన్స్ మరింతగా పెంచేశాయి. దానికి తగ్గట్లే KGF Chapter 2 ఉండటంతో ఫుల్ ఖషీ అయ్యారు అభిమానులు. అదే సమయంలో కేజీయఫ్ ఛాప్టర్ 2 సినిమా రిలీజ్ రోజే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చింది.
ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్లాక్, సంజయ్ దత్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయింది. ఇక సెకండాఫ్ లో 3 ఎపిసోడ్లు కంప్లీట్ మాస్ స్టఫ్ తో నిండిపోయాయి., క్లైమాక్స్ ఎమోషన్ తో కట్టిపడేస్తోంది. యష్ అభిమానులకు ఇదొక ట్రీట్ .
‘కేజిఎఫ్’కి సీక్వెల్ గా విడుదలైన ‘కెజిఎఫ్ 2’ అనూహ్యంగా నార్త్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించిందనే చెప్పాలి. దాదాపు 40 కోట్లపైన మొదటి రోజు హిందీ వర్షన్ కి వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ మొదటి రోజు నార్త్ లో వచ్చిన దాని కన్నా రెండింతలు కన్నా ఎక్కువ.
ఇక కర్ణాటకలో చెప్పేదేముంది. నాచురల్ గానే ఈ కన్నడ చిత్రం రికార్డు వసూళ్లు సాధించింది మొదటి రోజు. కేరళలో కూడా రాజమౌళి చిత్రానికి మించి ఓపెనింగ్ వచ్చింది. తమిళనాడులో విజయ్ నటించిన ‘బీస్ట్’ పోటీలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి మించి వసూళ్లు అందుకొంది.
తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ సాధించిన దానితో చాలా తక్కువే సాధించింది ‘కెజిఎఫ్ 2’. ఐతే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొదటి రోజు వసూళ్లు పెద్ద సినిమాలకు సమానంగానే వచ్చాయి. ఈ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో, భారీ ఓపెనింగ్ కి, టికెట్ రేట్లు కూడా కలిసొచ్చి పెద్ద అమౌంట్ కనిపిస్తోంది మొదటి రోజు.
ఇక ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ..కేజీయఫ్ ఛాప్టర్ 2 చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం తెలుస్తోంది. మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట.
కేజీయఫ్ 2 సినిమా మరో నెల రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేజీయఫ్ ఛాప్టర్ 2 సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ 'జీ' (ZEE) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేజీయఫ్ చిత్రం జీ తమిళం, జీ తెలుగు, జీ కన్నడ మరియు జీ కేరళలో ప్రసారం కానుంది.
350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైంది. 2018లో వచ్చిన కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా ఛాప్టర్ 2 వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్ని చెప్పుకున్నా ఒక కన్నడ చిత్రం దేశమంతా ఈ స్దాయి కలెక్షన్స్ , హంగామా క్రియేట్ చేయటం మాత్రం కనీవినీ ఎరుగనిది. రాజమౌళికి ఇప్పటికే దేశమంతా స్టార్ ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్ సహజంగా వస్తాయి... కానీ, ‘కెజిఎఫ్ 2’ మొదటి రోజు వసూళ్లు మాత్రం గ్రేట్ అంటున్నారు విశ్లేషకులు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ వంటివారు నటించారు.