MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ పేరు చెబుతూ ఆదిపురుష్ పై కేజిఎఫ్ నటి విమర్శలు.. ఓం రౌత్ కి అసలు రామాయణం తెలుసా ?

ఎన్టీఆర్ పేరు చెబుతూ ఆదిపురుష్ పై కేజిఎఫ్ నటి విమర్శలు.. ఓం రౌత్ కి అసలు రామాయణం తెలుసా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 04 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. ప్రేక్షకుల్ని, అభిమానులని టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ లో విజువల్స్ చూస్తుంటే ఇది యానిమేటెడ్ మూవీని తలపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ తరహా పాత్రలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రభాస్ రాముడి గెటప్ పై, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆదర్శ పురుషుడు అయిన శ్రీరాముడిని భారతీయులు భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. అలాంటి చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఆలోచనలు అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా లేవు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

36

అసలు ఓం రౌత్ తెరకెక్కిస్తోంది రామాయణమేనా అనే అనుమానం కలగక మానదు.  టీజర్ లో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ లుక్ అయితే దారుణంగా ఉంది. మన ఊహల్లో ఉండే రావణుడు వేరు.. ఓం రౌత్ చూపించిన రావణుడు వేరు. హాలీవుడ్ చిత్రాల్లో విలన్ తరహాలో రావణాసురుడిని చూపించారు. 

46

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేజిఎఫ్ నటి మాళవిక అవినాష్ డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు చేశారు. రావణుడు శివ భక్తుడు, లంకలో ఉంటాడు.. అతనికి 64 కళల్లో ప్రావీణ్యం ఉంది. కానీ మన చరిత్రని, రామాయణాన్ని బాలీవుడ్ దర్శకులు వక్రీకరిస్తున్నారు. రామాయణాన్ని ఇలా వక్రీకరించడం ఆపండి. రామాయణం చదవలేదా ? కనీసం ఎన్టీఆర్ పోషించిన పాత్రలని కూడా చూడలేదా అని మాళవిక అవినాష్ ఓం రౌత్ పై దుమ్మెత్తి పోశారు. 

56

ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు లాంటి దిగ్గజ నటులు రావణాసురుడి పాత్రలో అద్భుతంగా నటించారు. రామాయణం గురించి పక్కన పెట్టండి కనీసం మన సినిమాలైనా చూసి రావణాసురుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాల్సింది అంటూ మాళవిక అవినాష్ చురకలంటించారు. 

66

మాళవిక అవినాష్.. కెజిఎఫ్ చిత్రంలో రాఖీ భాయ్ గురించి తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో నటించారు. కన్నడలో ఆమె సీనియర్ నటి. ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకులని మాత్రమే కాదు.. సెలెబ్రిటీల సైతం డిజప్పాయింట్ చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Desire: ప్రభాస్‌కి ఎంత మంది పిల్లలు కావాలో తెలుసా? అమ్మాయిలో ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లికి రెడీ
Recommended image2
Nagarjuna: లెనిన్‌ విషయంలో నాది కూడా తప్పే.. ఒడిస్సీతో పోల్చుతూ మేకర్స్, ఇండస్ట్రీకి నాగార్జున చురకలు
Recommended image3
Uday Kiran: వీక్‌ మైండ్‌ ఉన్నవాళ్లు సినిమాల్లోకి రావద్దు.. ఉదయ్‌ కిరణ్ పై బడా నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved