- Home
- Entertainment
- KGF2 Story: `పుష్ప`లాగే `కేజీఎఫ్`.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2` స్టోరీ ఇదేనా?.. హాట్ టాపిక్
KGF2 Story: `పుష్ప`లాగే `కేజీఎఫ్`.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2` స్టోరీ ఇదేనా?.. హాట్ టాపిక్
ఇప్పుడు ఇండియన్ సినీ ప్రియులంతా వెయిట్ చేస్తున్న సినిమా `కేజీఎఫ్ 2`. ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఛాప్టర్ 2 స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాని ఇండియన్ సినిమాకి రుచి చూపించిన చిత్రం `కేజీఎఫ్`. రాకింగ్ స్టార్ యష్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన సినిమా, ప్రశాంత్ నీల్‌కి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రమిది. అనేక రికార్డులను తిరగరాసింది. సాలిడ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దీంతో రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపింది. ఇది కేవలం ఒక్క రోజులు వంద మిలియన్స్ వ్యూస్‌ని సాధించింది. భారీ అంచనాలతో రెండో భాగం రేపు(ఏప్రిల్ 14)గురువారం విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. సినిమా కథ ఇదే అంటూ పోస్టులు పెడుతున్నారు. `పుష్ప` సినిమాతో పోల్చుతున్నారు. మరి ఆ కథేంటో చూస్తే, `కేజీఎఫ్` మొదటి పార్ట్ గోల్డ్ మైనింగ్ అన్వేషణ, దాని చుట్టూ సాగే గోల్డ్ అక్రమ రవాణా, మాఫియా సామ్రాజ్యాన్నిచూపించారు. అదే సమయంలో ఓ కుర్రాళ్లు రాఖీభాయ్‌గా ఎదిగిన తీరుని చూపించారు.
మొత్తంగా అన్ని పాత్రలను పరిచయం చేయడం, కథని పరిచయం చేయడం, హీరో యష్.. రాఖీభాయ్‌గా తిరుగులేని రూలర్ రైజింగ్‌ని తీరుని చూపించారు. రెండో పార్ట్ లో రాఖీభాయ్ రూలింగ్‌ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. గరుడాని చంపిన తర్వాత రాఖీభాయ్ కోలార్ గోల్డ్ మైనింగ్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుని తనకు అందివచ్చిన వారితో చేతులు కలిపి బంగారు రవాణా చేయడం, అదే సమయంలో రాఖీభాయ్ అంటూ ప్రభుత్వాలు, ఇతర మాఫియా సామ్రాజ్యాలు, పోలీస్ డిపార్ట్ మెంట్ సైతం వణికేలా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే `కేజీఎఫ్‌ః పార్ట్ 1`లో ఓ సీన్‌గా రాఖీభాయ్ హవాని చూపించారు. అతను ఎంతటి పవర్‌ఫుల్ వ్యక్తో ఓ చిన్న సన్నివేశంలో చూపించారు. ఆయన కార్డ్ చూపిస్తేనే వణికిపోయిన తీరుని, అతని వెనకాల పెద్ద సైన్యం, హెలికాప్టర్ రావడం వంటి సన్నివేశాలను చూపించారు. రెండో పార్ట్ లో కరెక్ట్ గా అదే ఉండబోతుందని, ఆయన గోల్డ్ మైనింగ్ గనులను అడ్డు పెట్టుకుని చీకటి సామ్రాజాన్ని, ప్రభుత్వాలను ఎలా వణికించాడనేది చూపించబోతున్నట్టు సమాచారం. ఇందులో యష్ హీరోయిజం పీక్‌లో ఉండబోతుందట.
అదే సమయంలో బలమైన ప్రత్యర్థిగా అధిర పాత్రలో చేస్తున్నసంజయ్ దత్ ఉండనున్నారు. వీరిద్దరి మధ్యే బలమైన పోరు సాగుతుందని సమాచారం. మైనింగ్ కోసం ఇద్దరు నువ్వా నేనా అనేలా తలపడబోతున్నారని, ఒకానొక దశలో ఇద్దరు కలిసిపోతారని టాక్. అధికారం కోసం వీరిద్దరు పోటీ పడుతుంటే, ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోతుందని, భారతసైన్యాన్నిఉపయోగించి రాఖీని అంతం చేసే ప్రయత్నం చేయడం ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రధానిగా రవీనాటండన్ పాత్ర ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉండో చూడొచ్చు.
మరోవైపు ఇందులో హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రకి ప్రయారిటీ ఉండబోతుందట. ఆమె కూడా యష్ వద్దకి చేరి పోరాడుతుందని, ఆమెపాత్ర బలంగా ఉంటుందని ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కూడా చెప్పారు. ఆమె పాత్ర ప్రయారిటీని పెంచినట్టు టాక్. మొత్తంగా సినిమా ఆద్యంతం రసవత్తరంగా సాగబోతుందని, మొదటి పార్ట్ తో అంచనాలు పెంచగా, ఆ అంచనాలను అందుకునేలా ఉంటుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని `పుష్ప`తో పోల్చుతున్నారు. `కేజీఎఫ్`, `పుష్ప` కథలు దాదాపుగా ఉండబోతున్నాయని టాక్. `పుష్ప`లోనూ మొదటి భాగంలో పుష్పరాజ్ రైజింగ్‌ని చూపించారు. తన చిన్నతనం నుంచి జీవితంలో ఎదురైన అవమానాల నేపథ్యంలో చిన్న రోజువారి కూలోడు ఎర్రచందనం స్మగ్లింగ్‌కి సంబంధించిన సిండికేట్‌గా ఎదగడం మొదటి పార్ట్ లో చూపించారు. రెండో పార్ట్ లో `పుష్పః ది రూల్` అని తెలిపారు. అంటే పుష్పరాజ్ తన రూలింగ్‌ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ రెండు సినిమాలు ఒకేలా ఉండబోతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందనేది మాత్రం మరికొద్ది గంటల్లో తేలనుంది.