- Home
- Entertainment
- ఆదిపురుష్ టీజర్ గురించి లీకైన కీలక విషయాలు... ఫ్యాన్స్ కి పూనకాలు మూవీ లవర్స్ కి సంబరాలే!
ఆదిపురుష్ టీజర్ గురించి లీకైన కీలక విషయాలు... ఫ్యాన్స్ కి పూనకాలు మూవీ లవర్స్ కి సంబరాలే!
ఆదిపురుష్ టీజర్ విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సాయంత్రం 7:11 నిమిషాలకు గ్రాండ్ గా టీజర్ విడుదల చేయనున్నారు. కాగా ఆదిపురుష్ టీజర్ ఎలా ఉండబోతోందనే విషయానికి సంబంధించి ఆసక్తికర సంగతులు బయటికి వచ్చాయి.

Adipurush Teaser
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి మూవీ లవర్ కి ఆదిపురుష్ మూవీ చాలా ప్రత్యేకం. కారణం ఇది రామాయణ గాథ. వాల్మీకి రాసిన సంపూర్ణ రామాయణం ఆధారంగా వందల చిత్రాలు, సిరీస్లు తెరకెక్కాయి. అయితే దేనికదే ప్రత్యేకం. ఎన్నిసార్లు చూసినా, విన్నా జనరంజకమైన మధుర కావ్యంగా రామాయణం ఉంది.తరతరాలుగా అనేక మంది తెరకెక్కించినా ఆదరణ దక్కింది.
Adipurush Teaser
ఆదిపురుష్ మరింత ప్రత్యేకం అనడానికి కారణం... చాలా కాలం తర్వాత ఓ స్టార్ హీరో రామునిగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో అయితే 2011 లో బాలకృష్ణ శ్రీరామరాజ్యం మూవీలో రాముని పాత్ర చేశారు. ఇక ఈ జెనరేషన్ స్టార్స్ మహేష్, రామ్ చరణ్, పవన్, అల్లు అర్జున్ లలో ఎవరికీ ఆ ఛాన్స్ దక్కలేదు. బాల నటుడిగా ఎన్టీఆర్ మాత్రం చేశారు.
ఆదిపురుష్ విడుదలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లి భారీ హైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇది రామాయణానికి సంబంధించిన మైథలాజికల్ మూవీ నేపథ్యంలో అయోధ్యలో టీజర్ విడుదల చేస్తున్నారు. నేడు సాయంత్రం 7:11 నిమిషాలకు ఆదిపురుష్ టీజర్ విడుదల కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో టీజర్ విడుదల చేయడం ద్వారా హిందూ సెంటిమెంట్ క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది.
ఇక సెప్టెంబర్ 30న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దీని కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బాగున్నాయన్న విమర్శలు వినిపించాయి. అదే సమయంలో ప్రభాస్ లుక్ సాంప్రదాయ రాముని గెటప్ కి భిన్నంగా ఉంది. కోరమీసంతో, వైవిధ్యమైన కాస్ట్యూమ్స్ లో ప్రభాస్ ని రాముడిగా పరిచయం చేశారు.
ఫస్ట్ లుక్ కి మిక్స్డ్ టాక్ వచ్చినా టీజర్ తో ఆ అనుమానాలన్నీ బద్దలుకొట్టాలని మేకర్స్ దృఢ నిశ్చయం తో ఉన్నారు. ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసేలా టీజర్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. కాసేపట్లో విడుదల కానున్న ఆదిపురుష్ టీజర్ సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.
Adipurush Teaser
ఫస్ట్ లుక్ కి మిక్స్డ్ టాక్ వచ్చినా టీజర్ తో ఆ అనుమానాలన్నీ బద్దలుకొట్టాలని మేకర్స్ దృఢ నిశ్చయం తో ఉన్నారు. ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసేలా టీజర్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. కాసేపట్లో విడుదల కానున్న ఆదిపురుష్ టీజర్ సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.
ఆదిపురుష్ టీజర్ నిడివి రెగ్యులర్ టీజర్స్ కంటే ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సాధారణంగా టీజర్స్ 1 నిమిషం నుండి 1.5 నిడివి ఉంటాయి. ఆదిపురుష్ టీజర్ 2 నిమిషాలకు పైనే ఉంటుంది అంటున్నారు. ఇక టీజర్ లో విజువల్స్ హైలెట్ కానున్నాయట. ఆదిపురుష్ మూవీ బడ్జెట్ లో అధిక భాగం గ్రాఫిక్ వర్క్ కి ఖర్చు చేశారు. ఈ క్రమంలో అబ్బురపరిచే విజువల్స్ టీజర్ లో పొందుపపరిచారట.
ఇక వీర రౌద్ర రూప రామునిగా ప్రభాస్ ని పరిచయం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే శత్రువులపై విరుచుకుపడే రాముడిని మనం చూడవచ్చన్న మాట. అలాగే హీరోయిన్ కృతిసనన్, విలన్ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్స్ కూడా టీజర్ లో పరిచయం చేయనున్నారట. మొత్తంగా టీజర్ తో ఆదిపురుష్ పై అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు.
ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ తెరకెక్కుతుంది. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.