కీరవాణి ఇంట పెళ్లి భాజాలు.. సీనియర్ నటుడి మనవరాలితో శ్రీసింహా వివాహం ?
ఎంఎం కీరవాణి టాలీవుడ్ లో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. రాజమౌళితో కలసి కీరవాణి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో కృషి చేస్తున్నారు.
టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైనట్లు ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ 1న ఓ ఇంటివాడు కాబోతున్నారు. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం ఇటలీలో నవంబర్ 1న జరగనుంది. అదే విధంగా టాలీవుడ్ లో పెద్ద కుటుంబానికి చెందిన యువ హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దాశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న ఓ సీనియర్ నటుడి మానవరాలితో ఆ యువ హీరో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఎంఎం కీరవాణి టాలీవుడ్ లో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. రాజమౌళితో కలసి కీరవాణి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో కృషి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కీరవాణి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక సీనియర్ నటుడు మురళి మోహన్ దశాబ్దాలుగా తెలుగు చిత్రపరిశ్రమకి సేవలందిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా మురళి మోహన్ రాణించారు. వ్యాపారరంగంలో కూడా ఆయన ప్రమేయం ఉంది. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది.
కీరవాణి రెండో కొడుకు శ్రీసింహాకి.. మురళి మోహన్ మనవరాలికి వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారట. శ్రీసింహా టాలీవుడ్ లో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీసింహా మత్తు వదలరా చిత్రంతో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా శ్రీసింహా నుంచి వచ్చిన ఉస్తాద్ చిత్రం నిరాశపరిచింది.
ఫ్యామిలీ ప్రోత్సాహంతో శ్రీసింహా వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహంలా లేదు అని తెలుస్తోంది. ఆల్రెడీ శ్రీసింహా.. మురళి మోహన్ మనవరాలితో ప్రేమలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరి ప్రేమకు ఇటు కుటంబ సభ్యులు ఆంగీకారం తెలిపి పెళ్లి ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివాహం గురించి ఇటు కీరవాణి కుటుంబం నుంచి కానీ, మురళి మోహన్ కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.