- Home
- Entertainment
- కార్తీకదీపం నుంచి మోనిత పాత్రను ఎందుకు తీసేశారో తెలుసా..? శోభా శెట్టి షాకింగ్ కామెంట్స్
కార్తీకదీపం నుంచి మోనిత పాత్రను ఎందుకు తీసేశారో తెలుసా..? శోభా శెట్టి షాకింగ్ కామెంట్స్
కార్తీకదీపం సీరియల్స్ వీర ఫ్యాన్స్ కు ఈ మధ్య అందులో మోనిత పాత్ర కనిపిండంలేదు.. ఎందుకో అర్థం కావడంలేదు కదా..? ఇంతకీ మోనిత పాత్ర ఏమైనట్టు..? తీసేసి ఉంటారా..? అసలు ఏమైందో ఓ ఇంటర్వ్యూలో క్లియర్ గా వెల్లడించింది మోనిత పాత్రధారి శోభా శెట్టి.

టెలివిజన్ హిస్టరీలో కొన్ని సీరియల్స్ అలా ప్రేక్షకుల గుండెల్లో లినిచిపోయి ఉన్నాయి. అందులో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. దాదాపు ఐదారేళ్లుగా.. కార్తీకదీపం అభిమానులను అలరిస్తోంది. ఒక్క రోజు ఈ సీరియల్ మిస్ అయినా.. తట్టుకోలేక జుట్టుపీక్కునే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వారికి ఈ సీరియల్ లో ప్రతి క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది.
అలా గుర్తున్న పాత్రల్లో వంటలక్క, డాక్టర్ బాబు తరువాత చెప్పుకునేది మోనిత గురించే. ఈ పాత్రలో నటించి ఆర్టిస్ట్ పేరు శోభా శెట్టి. అయితే రీసెంట్ ఎపిసోడ్స్ లో మోనిత పాత్ర కనిపించడం లేదు. దాంతో కార్తీకదీపం డైహార్ట్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. మోనిత ఏమైయ్యింది. వస్తుందా రాదా అని .. గూగుల్ లో సెర్చ్ చేసిన వాళ్ళఉ కూడా లేకపోలేదు. దాంతో ..మోనిత పాత్రధారి శోభ దీనిపై క్లారిటి ఇచ్చింది.
తాజాగా శోభా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది.తనను కార్తీకదీపం సీరియల్ నుంచి కావాలనే తప్పించారని అంటోంది శోభ. నా లైఫ్‌లో నేను ఎన్నో సీరియల్స్ లో నటించాను. అక్కడ ఎన్నో సమస్యలు ఫేస్ చేశాను కానీ ఎప్పుడూ ఇంతలా బాధపడలేదు అంటోంది శోభ శెట్టి. ఈ సీరియర్ లో కోంత కాలం కనిపించకుండా పోయిన పాత్ర మళ్లీ రీ ఎంట్రీ తర్వాత 5 నెలలు మాత్రమే పని చేశాను అంటుంది శోభ.
సరిగ్గా నెక్ట్స్ షెడ్యూల్ షాపింగ్ కూడా చేసి రెడీ అయ్యాను... ఇంక పిలిస్తే వెళ్లడమే అనుకున్నట టైమ్ కు నా పాత్ర సీరియల్ లో జైలుకు వెళ్లినట్లు పెట్టారు.. జైలుకు వెళ్లొచ్చాక నా రీఎంట్రీ మళ్ళీ ఉంటుందని ఆశించాను.
కానీ నా పాత్రను తొలగించినట్టు చెప్పారు. దాంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అన్నారు శోభా శెట్టి. కథ డిమాండ్ చేయబట్టి. తప్పక నా పాత్రను సైడ్ చేశామంటూ వివరణ కూడా ఇచ్చారు. కాని అది నాకు నమ్మబుద్ది కాలేదు అంటోంది శోభ శెట్టి.
ఇక కథలో మోనిత గురించి డాక్టర్ బాబుకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి ఇప్పట్లో నా పాత్ర అవసరం లేదు.. కాబట్టి మోనిత ఫ్రెండ్ అయిన చారుశీలని రంగంలోకి దించారు. ఇప్పుడు కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ నా ఎంట్రీ ఉంటుంది. అప్పుడు మరింత అలరిస్తానంటోంది. శోభా శెట్టి. అయితే మోనిత పాత్ర పూర్తిగా తొలగించలేదని ఆడియన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మోనిత ఫ్యాన్స్ ఆమె ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.