సినిమాలు లేకపోతే మీకు వినోదం ఎక్కడి నుంచి వస్తుంది, కరీనా కపూర్ ఘాటు వ్యాఖ్యలు
చాలా కాలగా బాలీవుడ్ లో బాయి కాట్ ట్రెండ్ నడుస్తుంది. ఈక్రమంలో బాయ్ కాట్ ట్రెడ్ పై ఘాటుగా స్పందించారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు.

ఈ మధ్య బాలీవుడ్ కు అస్సలు కలిసి రావడంలేదు. ఏసినిమా చేసినా ప్లాప్ లిస్ట్ లో చేరిపోతుంది. దానికి తోడు గత కొంత కాలంగా బాలీవుడ్ ను బాయ్ కాట్ ట్రెండ్ కుదిపేస్తోంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతీ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించింది సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్.
ఈ దెబ్బ బాలీవుడ్ సినిమాలకు గట్టిగా తగులుతోంది. ఈ ట్రెండ్ కు భారీ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. వచ్చిన చిన్నా పెద్దా సినిమాలన్నీ చతికిలపడుతున్నాయి. ఇప్పటికే దీని ప్రభావంతో ఎన్నో సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలిపోయాయి.
అయితే ఈ విషయంలో తన వర్షన్ వెల్లడించింది బాలీవుడ్ అగ్రనటి కరీనా కపూర్. ఈ విషయంలో ఆమె స్పందిస్తూ... బాయ్ కాట్ ట్రెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. ఈ విషయంలో తాను అస్సలు ఏకీభవించనని చెప్పారు. బాయ్ కాట్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు చాలా వినోదాన్ని నష్టపోతారన్నారు కరీనా కపూర్.
అంత కాదు మీరు ఇలా చేస్తే.. తాము ఎలా ఎంటర్టయిన్ చేయగలమని ప్రశ్నించారు. అంతేనా.. సినిమాలే లేకపోతే మీకు వినోదం ఎక్కడి నుంచి వస్తుందని సూటిగా ప్రశ్నించారు కరీనా కపూర్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ వివాదం నడుస్తోంది. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన ఈమూవీపై చాలా మంది వ్యతిరేకత వ్యాక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కరీనా..ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమధ్య కరీనా కపూర్.. ఆమిర్ ఖాన్ జోడీగా లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటించింది. ఈసినిమా కూడా బాయ్ కాట్ దెబ్బకు బలైంది ఒక డిజాస్టర్ గా నిలిచిపోయింది. దాంతో బాలీవుడ్ స్టార్స్ తలలు పట్టుకుని కూర్చున్నారు.
pathan shahrukh khan
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ పఠాన్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీలో దీపికా కాషాయం రంగు బికినీ వేసుకుని.. బేషరమ్ అనే ఓ స్పైసీ పాటలో నటించడంతో.. వివాదం చెలరేగింది. అది అలానే నడుస్తోంది. దాంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.