- Home
- Entertainment
- 4 రోజుల్లోనే 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార చాప్టర్ 1, బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్
4 రోజుల్లోనే 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార చాప్టర్ 1, బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్
Kantara Chapter 1 Box Office Collection : రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. ఈసినిమా రిలీజ్ అయిన నాలుగో రోజు ట్రిపుల్ సెంచరీ కొట్టి, ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.

కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్లు
నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన అద్భుతం 'కాంతార చాప్టర్ 1. ఈ' సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 235 కోట్లు వసూలు చేసింది. ' 7 భాషల్లో 7000 థియేటర్లలో కాంతార-1 ను హోంబలే ఫిలింస్ విడుదల చేసింది.ఈ సినిమా అంతటా హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది. 'డివైన్ స్టార్' రిషబ్ శెట్టి సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా హౌస్‌ఫుల్ షోలు
ప్రపంచవ్యాప్తంగా కాంతార హవా నడుస్తోంది. భవిష్యత్తులో ఈ సినిమా 1000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించిన ఈసినిమాలో సీనియర్ నటుడు జయరాం కూడా కీలక పాత్రలో కనిపించారు. అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్
మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235 కోట్లు వసూలు చేసినట్టు చిత్రబృందం ప్రకటించింది. 4వ రోజు ఇండియాలో 61.5 కోట్లు రాబట్టింది మూవీ. హిందీలో 23.5 కోట్లు, కన్నడలో 15.5 కోట్లు, తెలుగులో 11.25 కోట్లు, తమిళంలో 6.5 కోట్లు, మలయాళంలో 4.75 కోట్లు వచ్చాయి. దీంతో 4 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లో చేరింది కాంతార చాప్టర్ 1.
30 దేశాల్లో విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’
కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో విడుదలైంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓజీ, సితారే జమీన్ పర్ సినిమాలను దాటింది. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. కేజీఎఫ్ 2 తర్వాత ఆ రికార్డును అందుకునే కన్నడ సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలుస్తుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి ఫైనల్ రన్ లో ఏం జరుగుతుందో చూడాలి.