ఐశ్వర్య రాయ్ పై కంగనా రనౌత్ కామెంట్స్.. ఏజ్ బార్ అయితే ఎవరూ పట్టించుకోరట..
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతోంది కంగనా రనౌత్. కాంట్రవర్సీ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మరిపోయింది. స్టార్స్ ఎవరైనా.. వారిగురించి చెప్పాల్సి వస్తే.. అస్సలు సంకోచించదు. ఇక తాజగా ఆమె ఐశ్వర్యరాయ్ మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాటలు సూటిగా ఉంటాయి. ఎప్పుడు ఏది అనిపిస్తే అది టక్కున అనేస్తుంది బ్యూటీ. అంతే కాదు ఎవరినైనా ఏదైనా అనాలన్నా.. వారు ఎంతటివారు అనేది చూసుకోదు...మాట అనేస్తుంది. అంతే కాదు ఎమైనా అనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తూ ఉంటుంది. తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బయటపెడుతూనే ఉంటుంది.
ఎవరికీ భయపడదు.. ఎమైనా చేస్తారన్న భయం కూడా ఉండదు. తాజాగా ఆడవారిపై.. అందులోను ఐశ్వర్యా రాయ్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 40,50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారి అందాన్ని ఎవరూ పట్టించుకోరు అంటూ మరోసారి కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ తో .. వివాదాన్ని రేపే ప్రయత్నాలు చేసింది కంగనా రనౌత్.
బాలీవుడ్‌లో క్వీన్‌గా వెలిగిపోతూ కూడా అక్కడవారు చేసే కొన్ని పనులు తనకు నచ్చవంటూ.. బాలీవుడ్ పై .. కొంత మంది స్టార్స్ పై గట్టిగా వ్యాతిరేకించిన కంగనా.. ఎన్నోసార్లు బాలీవుడ్ ను తన మాటలతో దులిపేసింది. ఇక ఈసారి కూడా బాలీవుడ్ కు సబంధించిన వారిపైనే గట్టిగా ఫోకస్ చేసింది బ్యూటీ. సాంగ్ రైటర్స్ అనేవారు కేవలం యువతుల అందాల గురించి మాత్రమే పాటలు రాస్తున్నారని, 40, 50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారు ఎంత అందంగా ఉంటారో చెప్పడం లేదని కంగనా కామెంట్స్ చేసింది.
అంతే కాకుండా తన మాటను సమర్థించుకోవడానికి మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాను ఉదాహరణగా చూపించింది బ్యూటీ.. ఈమూవీ నుంచి ఐశ్వర్య రాయ్ క్లిప్ ఒకటి షేర్ చేసింది. ఇందులో ఐశ్వర్య రాయ్ చాలా అందంగా, అసలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది.
ఈసినిమాలో మణిరత్నం హీరోల పాత్రల కంటే హీరోయిన్స్ పాత్రలకే ఎక్కువ విలువిచ్చారు. అందులో ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యాన్స్ అయ్యింది కూడా కుందవైగా నటించిన త్రిషకు, నందినిగా నటించిన ఐశ్వర్ రాయ్‌కే. ఇద్దరికి సమానంగా గుర్తింపు లభించింది అని అంటోంది.
అంతే కాదు పొన్నియిల్ సెల్వన్ 1లో కుందవైను నందిని కలిసే సీన్‌ను కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘బాలీవుడ్ లిరిసిస్ట్స్ 17 ఏళ్ల అమ్మాయిల గురించి చాలానే రాశారు. కానీ 40, 50 ఏళ్లు ఉన్న ఆడవారిలోని శృంగార భావం గురించి, వారిలో ఉండే ఆ మత్తు, మెరుపు గురించి రాయడంలో విఫలం అయ్యారు అంటోంది.
పొన్నియన్ సెల్వన్ లో ఏజ్ పెరిగిన ఆడవారికి కూడా ఎంతో విలువిచ్చారు... బాలీవుడ్ లో అలా చేయగలరా అని ఆమె సూటిగా చెప్పారు. వారు కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు.. స్మార్ట్‌గా, అనుభవంతో కూడా ఉంటారు. రెండు అందమైన చందమామలు అంటూ తను షేర్ చేసిన వీడియో గురించి రాసుకొచ్చింది కంగనా.
Image: Getty
కంగనా.. ఐశ్వర్య వీడియో షేర్ చేయడమేంటి...? తన అందం గురించి ప్రశంసించడమేంటి? తనను చందమామ అని పిలవడమేంటి? అని సోషల్ మీడియాల జనాలు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇది నిజం..నిజంగా వారిని బాలీవుడ్ పట్టించుకోవడంలేదు అని మరికొంత మంది సపోర్ట్ చేస్తున్నారు.