MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Silk Smitha: చిరంజీవి ముందు సిల్క్ స్మిత కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది.! ఆమెతో సీన్ వచ్చేసరికి..

Silk Smitha: చిరంజీవి ముందు సిల్క్ స్మిత కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది.! ఆమెతో సీన్ వచ్చేసరికి..

Silk Smitha: సిల్క్ స్మిత క్రేజ్, ఆమె మరణం వెనుక ఉన్న షాకింగ్ నిజాలను దర్శకుడు కనగాల జయకుమార్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవితో షూటింగ్ అనుభవాలు, ఆమె కొరికిన ఆపిల్ వేలంలో రూ. 25 వేలు పలకడం వంటి ఆసక్తికర విషయాలతో పాటు.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 14 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం కాదు..
Image Credit : Twitter

ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం కాదు..

ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాల్లో సిల్క్ స్మిత పాట లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనేవారు కాదంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక స్టార్‌డమ్ సృష్టించుకున్న సిల్క్ స్మిత వ్యక్తిత్వం, ఆమె విషాదకర మరణం వెనుక ఉన్న కారణాలను దర్శకుడు కనగాల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆమెలోని ఆత్మవిశ్వాసం - 'అప్పటి పుష్ప'
Image Credit : Twitter

ఆమెలోని ఆత్మవిశ్వాసం - 'అప్పటి పుష్ప'

సిల్క్ స్మిత సెట్స్‌లో చాలా ధైర్యంగా, ఎవరికీ తలవంచకుండా ఉండేదని జయకుమార్ తెలిపారు. ఎంత పెద్ద హీరోలు సెట్స్‌లోకి వచ్చినా ఆమె కాళ్ల మీద కాళ్లు వేసుకుని స్టైల్‌గా కూర్చునేదని, ఇది నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించేదని ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే ఆమెను 'అప్పటి పుష్ప' అని ఆయన అభివర్ణించారు. ఆమె కళ్లలో ఒక మ్యాజిక్ ఉండేదని, క్లోజప్ షాట్లలో ఆమె అందం అద్భుతంగా ఉండేదని ఆయన కొనియాడారు.

Related Articles

Related image1
Silk Smitha Biopic : సిల్క్ స్మిత మరో బయోపిక్.. వైరల్ గా మారిన ఫస్ట్ లుక్.. హీరోయిన్ ఎవరంటే?
Related image2
Silk Smitha : 15 ఏళ్లకే పెళ్లి.. పేదరికం నుంచి స్టార్ స్టేటస్.. అలా నరకం.. స్కిల్ స్మిత లైఫ్ స్టోరీ తెలుసా?
35
మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఆసక్తికర ఘటన
Image Credit : Twitter

మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఆసక్తికర ఘటన

ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను జయకుమార్ వివరించారు. దర్శకుడు క్రాంతి కుమార్ సెట్స్‌లో సిల్క్ స్మిత కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చున్నప్పుడు, చిరంజీవి డైలాగ్ చెప్పుకుంటూ ఆమె దగ్గరకు వచ్చే షాట్ ఉంది. ఆ సమయంలో చిరంజీవి ఆమెను కొట్టే సీన్‌లో, కేవలం లైట్ గా టచ్ చేసినా ఆమె ఓవర్ గా రియాక్ట్ అయి కింద పడిపోయిందని, ఆ తర్వాత ఆమెను అనునయించి షాట్ పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న అవమానాల వల్లే ఎవరినీ లెక్క చేయకుండా ఉండే స్వభావం ఆమెలో ఏర్పడిందని ఆయన తెలిపారు.

45
 క్రేజ్ అంటే సిల్క్ స్మితదే!
Image Credit : Twitter

క్రేజ్ అంటే సిల్క్ స్మితదే!

సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ కు లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ.. ఒక ఫంక్షన్‌లో ఆమె కొరికిన ఆపిల్ ను వేలం వేస్తే ఆ రోజుల్లోనే ఒక అభిమాని రూ. 25,000 పెట్టి కొనుక్కున్నారని జయకుమార్ వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాలో సిల్క్ స్మిత డాన్స్ ఉందా లేదా అని అడిగి మరీ సినిమాలను కొనేవారని ఆయన తెలిపారు.

55
సినిమా నిర్మాణం, పతనం
Image Credit : Twitter

సినిమా నిర్మాణం, పతనం

సిల్క్ స్మిత జీవితం మలుపు తిరగడానికి ఒక డాక్టర్ తో ఏర్పడిన పరిచయం కారణమని ఆయన పేర్కొన్నారు. ఆమెతో హీరోయిన్ గా సినిమాలు తీయించి, ఆ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయని ఆయన తెలిపారు. దీనివల్ల అప్పటి వరకు ఉన్న క్రేజ్ తగ్గిపోయిందని, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని ఆయన వివరించారు. చివరికి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒక భయంకరమైన దృశ్యమని, ఒక గొప్ప నటిని మనం కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సిల్క్ స్మిత మరణం చుట్టూ అనేక ఊహగానాలు ఉన్నప్పటికీ, ఆమె తన జ్ఞాపకాలను, స్టార్‌డమ్‌ను ఇప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉంచుకుంది. ఆమె జీవితం ఒక వెలుగు వెలిగిన మహారాణి లాంటిదని దర్శకుడు జయకుమార్ గుర్తు చేసుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Recommended image2
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
Recommended image3
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Silk Smitha Biopic : సిల్క్ స్మిత మరో బయోపిక్.. వైరల్ గా మారిన ఫస్ట్ లుక్.. హీరోయిన్ ఎవరంటే?
Recommended image2
Silk Smitha : 15 ఏళ్లకే పెళ్లి.. పేదరికం నుంచి స్టార్ స్టేటస్.. అలా నరకం.. స్కిల్ స్మిత లైఫ్ స్టోరీ తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved