కమల్ హాసన్‌కి బెదిరింపులు.. నటుడు రవిచంద్రన్ పై కేసు.. గొడవేంటంటే?
కమల్ హాసన్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. `మక్కల్ నీది మయ్యం` పార్టీ వాళ్ళు చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. నటుడు రవిచంద్రన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

కమల్ హాసన్ కి బెదిరింపు కాల్స్
సనాతన ధర్మం గురించి మాట్లాడిన మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ కి నటుడు రవిచంద్రన్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేసినట్టు చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు అందింది.
KNOW
పోలీస్‌లకు ఫిర్యాదు చేసిన కమల్ పార్టీ నాయకులు
`మక్కల్ నీది మయ్యం` పార్టీ ఉపాధ్యక్షుడు, రిటైర్డ్ ఐజీ మౌర్యా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. నటుడు రవిచందర్‌పై చర్యలు తీసుకోవాలని వారు పోలీస్‌లను కోరారు. అగరం ఫౌండేషన్ వేడుకలో కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దీనికి వ్యతిరేకంగా నటుడు రవిచంద్రన్ కమల్ ని చంపేస్తామని బెదిరించినట్టు మక్కల్ నీది మయ్యం పార్టీ ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసుల విచారణ
ఈ సంఘటన గురించి 30 మందికి పైగా మక్కల్ నీది మయ్యం పార్టీ నాయకులు పోలీస్ కమిషనర్ ని కలిసి చర్యలు తీసుకోమని కోరారు. ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా ఈ విషయం తమిళనాట పెద్ద రచ్చ లేపుతుంది.
ఎంపీగా ఎంపికైన కమల్ హాసన్
కమల్ హాసన్‌కి ఇటీవల డీఎంకే రాజ్యసభ ఎంపీ సీటుని కేటాయించింది. గత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కమల్‌కి ఎంపీ సీటుని కేటాయించింది డీఎంకే. దీంతో ఇటీవలే ఆయన ఎంపిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కమల్ వరుస ఫెయిల్యూర్స్
`విక్రమ్`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న కమల్ హాసన్ ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఫేస్ చేశారు. `భారతీయుడు 2` డిజప్పాయింట్ చేసింది. ఇటీవల `థగ్ లైఫ్` కూడా ఆడలేదు. కానీ ఇది ఓటీటీలో మాత్రం బాగా ఆదరణ పొందింది. మరోవైపు `కల్కి 2898ఏడీ`లో చివర్లో కాసేపు మెరిశారు. రెండో పార్ట్ లో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఇక ఆయన హీరోగా కొత్త ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.