Amigos Review కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ప్రీమియర్ రివ్యూ.. నందమూరి హీరో మూడు పాత్రల్లో మెప్పించాడా..?
డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. చాలా కాలం తరువాత బింబిసార సినిమాతో హిట్ కొట్టిన నందమూరి హీరో.. ఇప్పుడు అమిగోస్ అనే సరికొత్త సినిమాతో ఈరోజు(10 పిబ్రవరి) ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమిగోస్ రిలీజ్ అవుతుండగా.. యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోస్ సందడి చేశాయి. మరి సినిమా ఎలా ఉంది..? కళ్యాణ్ రామ్ కు కలిసొచ్చిందా లేదా చూద్దాం..?
రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అమిగోస్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. నందమూరి కళ్యాణ్‌రామ్, ఆశికా రంగనాథ్ హీరో హీరోయిన్లు గా.. రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో.. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా అమిగోస్. జిబ్రాన్ సంగీతం అందించిన ఈమూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు
ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్ గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలొ, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్‌గా మూడు సరికొత్త పాత్రల్లో కనిపించాడు నందమూరి హీరో. ఈ ముగ్గురు ఎదురయిన తరువాత జరిగే సంఘటనలు ఆధారంగాసినిమా తెరకెక్కింది. అసలు ఈ ముగ్గురి మధ్య రక్త సంబంధం ఉందా..? లేక పోలికలు మాత్రమే కలిగి ఉన్నారా ? ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ పాత్ర అయిన మైఖేల్... తనలా ఉండే ఆ ఇద్దరు పాత్రలను ఎలా ఉపయోగించుకున్నాడు.. తరువాత ఏంజరిగింది అనేది సినిమా కథ.
ఈ ముగ్గరు కలిసినప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ పాత్రలో మైఖేల్.. మిగిలిన ఇద్దరిని తనకు అనకూలంగా వాడుకునే ప్రయత్నంచేస్తాడు. ఈ గ్యాంగ్‌స్టర్ ఈ ఇద్దరిని ఎలా వాడుకొని NIA వాళ్లనుంచి తప్పించుకున్నాడు. మరి అది ఎంత వరకూ వర్కౌట్ అయ్యింది. ఈ విషయంలో మిగిలిన రెండు పాత్రలు కావాలని సపోర్ట్ చేశాయా..? లేక అదిగ్యాంగ్ స్టార్ మాయా.. ఈ మూడు పాత్రలు ఎదురైన తరువాత వారి జీవితంలో జరిగిన సంఘర్షణలు ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. పాజిటీవ్.. నెగెటీవ్ పాత్రల్లో హీరో కమ్ విలన్ గా కళ్యాణ్ రామ్ అద్బుతంగా నటించాడు. మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ చూపించడం అంటే.. పెద్ద టాస్క్ అని చెప్పాలి. కాని ఆ విషయంలో నందమూరి హీరో ఓరెండు మెట్లు ఎక్కాడు. రీసెంట్‌గా బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో అలరించిన ఈ నందమూరి హీరో.. ఈసినిమాలో మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం చూపించాడు. ఇక ఈసినిమాకు హీరోయిన్ ఆషిక గ్లామర్ బాగా ప్లస్ అయ్యింది. ఆమె నటనకు కూడామంచి మార్కులు పడ్డాయి.
ఇక దర్శకుడు రాజేంద్ర రెడ్డి సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. హీరో చేత మూడు పాత్రలు చేయించడం అంటే చాలా కష్టం కాని దర్శకుడు ఈ విషయంలో ఆడియన్స్ కు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా..పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డ్రైవ్ చేశాడు. ఇక జిబ్రాన్ మ్యూజ్ కూడా సినిమాకు కలిసోచ్చింది. ఈసినిమాలో ఫస్ట్ నుంచీ హైలెట్ చేస్తూ వస్తున్న ఎన్నో రాత్రులోస్తాయి సాంగ్.. సినిమాలో కూడా బాగా వర్కైట్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రన్ .. ఈ పాటను ఇప్పుడు ఉన్న జనరేషన్ కు తగ్గట్టు అద్భుతంగా రీమిక్స్ చేశాడని చెప్పుకోవచ్చు. స్క్రీన్ పై కూడా ఈ సాంగ్ ను బాగా విజ్యువలైజ్ చేశారు.
ఓవర్ ఆల్ గా బింబిసార తరువాత కళ్యాణ్‌రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ మరోసారి బాగుంది.అమిగోస్ సినిమా ఎంగేజింగ్ థ్రిల్లర్, తెలుగు ఆడియన్స్ కు నచ్చేలా భిన్నమైన అనుభవం కలుగుతుంది. చాలా కష్టమైన ట్రిపుల్ రోల్ స్క్రిప్ట్‌ని ప్రేక్షకులకు ఎలాంటి గందరగోళం లేకుండా డైరెక్టర్ రాజేందర్ రెడ్డి డ్రైవ్ చేశారు. ఆషిక గ్లామర్ సినిమాకు ప్లాస్ అయ్యిందని చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.