MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కళ్యాణ్‌ నిబ్బా నిబ్బి, మెచ్యూరిటీ లేదు.. రమ్య మోక్ష బోల్డ్ స్టేట్‌మెంట్‌.. తనూజ, పవన్‌, దివ్యాలపై క్రేజీ కామెంట్‌

కళ్యాణ్‌ నిబ్బా నిబ్బి, మెచ్యూరిటీ లేదు.. రమ్య మోక్ష బోల్డ్ స్టేట్‌మెంట్‌.. తనూజ, పవన్‌, దివ్యాలపై క్రేజీ కామెంట్‌

ఏడో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె వెళ్లిపోతూ కళ్యాణ్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఏకంగా నిబ్బా నిబ్బి అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 26 2025, 11:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్‌
Image Credit : x/bigg boss telugu 9

ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ఏడోవారం ఎలిమినేషన్‌ విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్‌ అయ్యింది. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్‌ అయిన రమ్య మోక్ష.. ఈ పచ్చళ్ల వివాదంతో పాపులర్‌ అయ్యింది. ఆ పాపులారిటీ బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోలో పాల్గొనేలా చేసింది. ఐదో వారం వైల్డ్ కార్డ్ ద్వారా రమ్య మోక్ష బిగ్‌ బాస్‌ షోలోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చి రెండు వారాలే అవుతుంది. అప్పుడే ఎలిమినేట్‌ అయ్యింది. ఈ ఆదివారం ఎపిసోడ్‌లో ఆమె హౌజ్‌ని వీడింది. సంజనా, రమ్య మోక్ష మధ్య ఈ ఎలిమినేషన్‌ ప్రక్రియ జరగ్గా సంజనా సేవ్ అయ్యింది. దీంతో రమ్య ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కళ్యాణ్‌ పెద్ద నిబ్బా నిబ్బి
Image Credit : instagram/bigg boss telugu

కళ్యాణ్‌ పెద్ద నిబ్బా నిబ్బి

ఇక వెళ్లిపోతూ  స్క్రాప్ ఎవరు అనేది చెప్పాలని నాగార్జున అడగ్గా, కళ్యాణ్‌ నిబ్బా నిబ్బిలా ఉంటాడని తెలిపింది. మెచ్యూరిటీ లేదని, ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా, ఫస్ట్ టైమ్ లవ్‌ లో పడినట్టు బిహేవ్‌ చేస్తాడని తెలిపింది. ఏదో మాట్లాడుతుంటాడుగానీ, మాట్లాడటం కూడా రాదు అని తెలిపింది. అనంతరం దివ్య ఫోటోని స్క్రాప్‌లో వేసిన రమ్య.. అంతకు ముందు భరణితోనే ఎక్కువగా ఉండేదని, ఆయన వెళ్లిపోయాక ఆమెలో చాలా మార్పుకనిపిస్తుందని, ప్రతిదానికి కోప్పడుతుందని తెలిపింది. తనూజ గురించి చెబుతూ, విషయం పూర్తిగా తెలుసుకోక, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుందని నిజం తెలుసుకొని రియాక్ట్ కావాలని తెలిపింది. ఇక గౌరవ్‌ గురించి రమ్య చెబుతూ, ఆయన రాక్షసుడు అని, ఏదైనా చేయల్సి వస్తే దాని మీదనే ఉంటాడని, వదలడని తెలిపింది. ఈగో ఎక్కువ అని, తనే గెలవాలని కోరుకుంటాడని తెలిపింది. అనంతరం పవన్‌ ఫోటోని స్క్రాప్‌ లో వేస్తూ నీ గేమ్ నువ్వు ఆడు అని, ఊరికే ఎమోషనల్‌ కావద్దు అని, ఇతర విషయాలపై కాకుండా గేమ్‌ పై ఫోకస్‌పెట్టాలని తెలిపింది. బిగ్‌ బాంబ్ రీతూకి ఇచ్చింది. ఈ వారం మొత్తం ఆమె బాత్రూమ్‌లు క్లీన్‌ చేయాలి.

Related Articles

Related image1
రమ్య మోక్ష రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా, సెలబ్రిటీ రేంజ్‌.. ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ పండగ
Related image2
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు
36
తనూజ గోల్డెన్‌ అస్త్ర
Image Credit : starmaa

తనూజ గోల్డెన్‌ అస్త్ర

ఎలిమినేషన్‌ పక్కన పెడితే ఈ రోజు సండే కావడంతో కొన్ని ఫన్‌ గేమ్‌లు ఆడించాడు హోస్ట్ నాగార్జున. అలాగే పవర్‌ అస్త్రలకు సంబంధించిన టాస్క్ కూడా ఇచ్చారు. గోల్డెన్‌ అస్త్రాకి సంబంధించి సుమన్‌, తనూజ, రీతూ, సంజనా, దివ్య వంటి వారు గేమ్‌ ఆడారు. ఇందులో ముందుగా గోల్ ఫినిష్‌ చేసి తనూజ గోల్డెన్‌ అస్త్రాని గెలుచుకుంది. దీంతో ఆమె  ఎలిమినేషన్‌ నుంచి ఒకరిని సేవ్‌ చేసే పవర్‌ ని పొందింది. అయితే అది వచ్చే వారం నుంచి పనిచేస్తుందని నాగార్జున తెలిపారు.

46
ఫన్నీ టాస్క్ లో సుమన్‌ శెట్టి, రమ్య డాన్సులు కేక
Image Credit : starmaa

ఫన్నీ టాస్క్ లో సుమన్‌ శెట్టి, రమ్య డాన్సులు కేక

మరోవైపు సెలబ్రిటీల ఫోటోలను చూపిస్తూ, ఆ ఫోటోల వెనుక మరో బొమ్మ ఉంటుంది. దాన్ని బట్టి ఆ సెలబ్రిటీల సినిమా పాటలను గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో సంజనా టీమ్, మాధురీ టీమ్‌ పాల్గొన్నారు. ఇందులో రెండు టీమ్ లు ఈక్వల్‌ అయ్యారు. ఈక్వెల్‌ కావడంతో కెప్టెన్‌ ఇమ్మాన్యుయెల్‌ నిర్ణయం ప్రకారం సంజనా టీమ్ ని విన్నర్‌గా ప్రకటించారు. ఇందులో రమ్య, సుమన్‌ శెట్టి డాన్సు, అలాగే రమ్య, పవన్‌ ల డాన్సు అదిరిపోయింది. 

56
సుమన్‌ కామెడీ కేక
Image Credit : starmaa

సుమన్‌ కామెడీ కేక

దీంతోపాటు కళ్లకి గంతలు కట్టి టేస్ట్ ను గెస్ చేసే టాస్క్ లో రమ్య మోక్ష పులిహోరలో ఏం వాడతారనేది చెప్పలేక నవ్వులపాలయ్యింది. ఆదివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి కామెడీని చూపించారు. ఆయన, తనూజతో కలిసి డబ్బులు దొంగతనం చేయడం, అలాగే పానీ పురీలు తినే సీన్లని చూపించగా అవి ఆద్యంతం నవ్వులు పూయించాయి.

66
సంజనాకి పనిష్‌మెంట్‌
Image Credit : starmaa

సంజనాకి పనిష్‌మెంట్‌

మరోవైపు బిగ్‌ బాస్‌ టాస్క్ లు, నాగార్జున ఇచ్చిన టాస్క్ ల ఫలితంగా ఈవారం హౌజ్‌లో ఒకరు అన్‌విజబుల్‌ అవ్వాలనేది ఉంది. అందులో కెప్టెన్‌ ఇమ్మాన్యుయెల్‌ ఎక్కువగా తప్పులు చేసిన సంజనాని ఈ పనిష్‌మెంట్‌కి ఎంపిక చేశారు. ఈ లెక్కన ఆమె ఈ వారం రోజులపాటు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఆమె హౌజ్‌లో లేనట్టే ఉండాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Related Stories
Recommended image1
రమ్య మోక్ష రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా, సెలబ్రిటీ రేంజ్‌.. ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ పండగ
Recommended image2
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved