- Home
- Entertainment
- చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నా, క్షమించడం అలవాటు చేసుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నా, క్షమించడం అలవాటు చేసుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుండడంతో కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

చాలా కాలంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. శ్రీజ సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ దేవ్ గురించి ప్రస్తావన లేదు. కళ్యాణ్ దేవ్ కూడా తన ముద్దుల కుమార్తె గురించి పోస్ట్ లు పెడుతున్నాడు కానీ.. శ్రీజతో ఉన్న ఎలాంటి ఫొటోస్ షేర్ చేయడం లేదు.
దీనితో వీరిద్దరూ విడిపోయారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇలా కళ్యాణ్ దేవ్ తరచుగా సోషల్ మీడియాలో చేస్తున్న ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుండడంతో కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
2022 సంవత్సరం నాకు చాలా నేర్పింది. ఈ ఏడాది ఎదుగుదలని ఇచ్చింది, అలాగే సహనంతో ఉండటం నేర్చుకున్నా. అవకాశాలు అందుకున్నా, రిస్క్ లు చేశా. నా తప్పుల నుంచి నేర్చుకున్నా.. ఇతరుల తప్పులని క్షమించడం అలవాటు చేసుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా ప్రయత్నాన్ని ఆపను.
మీ అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టాడు. ఇక కళ్యాణ్ దేవ్ నుంచి శ్రీజ విషయంలో ఎలాంటి ప్రస్తావన లేదు. 2016లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండవ వివాహమే.
కానీ ఏమైందో కానీ కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి ఉండడం లేదని అర్థం అవుతోంది. శ్రీజ ఆ మధ్యన మానసిక వేదనకి గురైనప్పుడు రాంచరణ్ ఆమెని వెకేషన్ కి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే.
శ్రీజకి ఇద్దరు కుమార్తెలు సంతానం. మొదటి భర్త ద్వారా ఒక కుమార్తె కాగా.. కళ్యాణ్ దేవ్ ద్వారా రెండవ కుమార్తె జన్మించారు. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. అవికా గోర్ తో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ కి అవికా 'హగ్' అంటూ కామెంట్ పెట్టింది.